యూసీసీ తీసుకురావడం ఆర్టికల్ 370 రద్దు చేసినంత సులువు కాదు - గులాం నబీ ఆజాద్

యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం ఆర్టికల్ 370 రద్దు చేసినంత సులువు కాదని కేంద్ర మాజీ మంత్రి, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి మంచివి కావని తెలిపారు. 

Bringing in UCC is not as easy as repealing Article 370 - Ghulam Nabi Azad..ISR

ప్రస్తుతం దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) చర్చ జరుగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే దీనిని ఇస్లామిక్ సంస్థలు ఇప్పటికే వ్యతిరేకించగా.. బీజేపీ, దాని కొన్ని మిత్రపక్షాలు స్వాగతించాయి. మరి కొన్ని మిత్రపక్షాలు తమ భయాలను వ్యక్తం చేశాయి. పలు ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ మాజీ నాయకుడు, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ ఈ అంశంపై వ్యాఖ్యానించారు. 

పొలంలో ట్రాక్టర్ నడిపి, వరి నాట్లు వేసిన రాహుల్ గాంధీ.. రైతులతో ముచ్చట్లు పెట్టిన కాంగ్రెస్ నేత..

ఈ విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్నికి ఆజాద్ పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూసీసీతో ముందుకు వెళ్లాలని 'ఎప్పుడూ ఆలోచించవద్దని'  కేంద్రానికి సూచించారు. ‘ఆర్టికల్ 370 రద్దు చేసినంత సులువు కాదు. ముస్లిములే కాదు, సిక్కులు, క్రైస్తవులు, గిరిజనులు, జైనులు, పార్శీలు సహా అన్ని మతాలు ఇక్కడ ఉన్నాయి. ఒకేసారి ఇన్ని మతాలను రెచ్చగొట్టడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదని, ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ఎప్పుడూ ఆలోచించకూడదని ఈ ప్రభుత్వానికి నా సలహా’ అని ఆయన అన్నారు.

జమ్మూకాశ్మీర్ లో ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణపై ఆజాద్ మాట్లాడుతూ.. ‘2018లో అసెంబ్లీ రద్దయినప్పటి నుంచి జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాం. జమ్ముకాశ్మీర్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణ కోసం అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా మారి ప్రభుత్వాన్ని నడుపుతారు. ఎందుకంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రజాస్వామ్యంలో ఎన్నో పనులు చేయగలరు. ప్రపంచవ్యాప్తంగా కానీ, భారతదేశంలోని ఏ ప్రాంతంలో అయినా 'ఆఫీసర్ సర్కార్' ఆరు నెలలకు మించి నడవదు’’ అని ఆజాద్ అన్నారు.

కాగా.. యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) విషయంలో లా కమిషన్ ఆఫ్ ఇండియా శుక్రవారం డిస్క్లైమర్ జారీ చేసింది. అనేక వాట్సప్ గ్రూపుల్లో కొన్ని ఫోన్ నెంబర్లు తిరుగుతున్నాయని ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.  వాటితో లా కమిషన్ కు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios