పొలంలో ట్రాక్టర్ నడిపి, వరి నాట్లు వేసిన రాహుల్ గాంధీ.. రైతులతో ముచ్చట్లు పెట్టిన కాంగ్రెస్ నేత..
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆకస్మికంగా హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు.శనివారం తెల్లవారుజామున అక్కడి మదీనా గ్రామానికి చేరుకొని పొలాల్లోకి వెళ్లారు. రైతులో మాట్లాడి, వరి నాట్లు వేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఆకస్మికంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మదీనా గ్రామానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న పొలాల్లోకి ఆయన వెళ్లారు. అందులో ట్రాక్టర్ నడిపారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
విషాదం.. ప్రియురాలికి వివాహమైందని యువకుడి ఆత్మహత్య.. పెళ్లయిన 3 రోజుల తరువాత నవ వధువు కూడా..
అనంతరం రైతులతో కలిసి వరి నాట్లు కూడా వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. ‘‘ఇది ఒక ఆకస్మిక పర్యటన. శనివారం తెల్లవారుజామున సోనిపట్ జిల్లా మదీనా గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులు, పొలాల్లో పనిచేసే రైతులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ కూడా వరి నాట్లు వేశారు. అక్కడ ట్రాక్టర్ నడిపారు’’ అని సోనిపట్ లోని గోహానా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్బీర్ సింగ్ మాలిక్ ‘పీటీఐ’కు ఫోన్ లో తెలిపారు.
రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి తరువాత హిమాచల్ ప్రదేశ్ వెళ్తారని జగ్బీర్ సింగ్ మాలిక్ చెప్పారు. కాగా.. రాహుల్ గాంధీ పొలంలో రైతులతో మాట్లాడుతున్న ఫొటోను ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. అందులో రాహుల్ గాంధీ తెల్లని టీషర్ట్, ప్యాంటు ధరించి కనిపించారు. గ్రామస్తులతో కలిసి పొలాల్లోకి అడుగుపెడుతున్నారు.
హింసాత్మకంగా మారిన బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. ఘర్షణల్లో 9 మంది మృతి, బ్యాలెట్ బాక్సులు దగ్ధం
ఇదిలా ఉండగా.. మోడీ ఇంటిపేరు కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. 2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఆ సమయంలో ‘రాహుల్ గాంధీ దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది’’ అని ప్రశ్నించారు. ‘‘నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ... వారందరికీ మోడీని ఒక ఉమ్మడి ఇంటిపేరుగా ఎలా కలిగి ఉన్నారు? దొంగలందరికీ మోడీ అనే ఉమ్మడి ఇంటిపేరు ఎలా ఉంటుంది?’’ అని అన్నారు.
నాకింకా ముసలితనం రాలేదు.. నేను ఇంకా పని చేయగలను - అజిత్ పవర్ కు కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పరువు నష్టం దావా వేశారు, గతంలో ఇదే తరహా కేసులో సూరత్ లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 23న గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.