ఇంటిలోకి దూసుకొచ్చి పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి.. కుక్కను నోట్లో కరుచుకుని..! భయానక సీసీటీవీ వీడియో ఇదే
మహారాష్ట్రలో ఓ చిరుత పులి కలకలం రేపింది. ఇంటి వరండాలోకి వెళ్లి కట్టేసి ఉంచిన కుక్కను చంపేసింది. నోట్లో కరుచుకుని ఆ కుక్కను పట్టుకెళ్లింది. మంగళవారం రాత్రి పూణెలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది.
పూణె: మహారాష్ట్రలోని పూణెలో ఓ చిరుత పులి కలకలం రేపింది. కొన్నాళ్లుగా ఆ చిరుత బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ ఉన్నది. చాలా మంది ఆ చిరుతను చూసి బెంబేలెత్తి అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తులూ చేశారు. తాజాగా, ఈ దాడి ఓ ఇంటి ఎదుట కట్టి ఉంచిన పెంపుడు కుక్కపై దాడి చేసింది. నోట్లో కరుచుకుని ఆ కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటన హింజెవాడి ఐటీ పార్క్ ఫేజ్ 3 సమీపంలోని నేరే గ్రామంలో షిండె వాస్తీ ఏరియాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. శంభాజీ బాబన్ జాదవ్ తమ ఇంటి ఎదురుగా ఖాళీ వరండాలో పెంపుడు కుక్కను కట్టేసి ఉంచారు. రాత్రి వారంతా పడుకున్నాక.. ఓ చిరుత పులి అటు వైపుగా వచ్చింది. ఓ కుక్క అక్కడ ఉన్నదని చూసి వచ్చింది. మెల్లగా మాటువేసి నిశబ్దంగా దాని మీదికి ఒక్క ఉదుటున దూకేసింది. వెంటనే మెలకువకు వచ్చిన కుక్క అరవడం మొదలు పెట్టింది. క్షణాల్లోనే ఆ చిరుత కుక్క మెడను గట్టిగా కరిచి పట్టుకుంది. కొన్ని నిమిషాలపాటు అలాగే కుక్క మెడను కదలకుండా గట్టిగా నోట్లో కురుచుకునే ఉంచుకుంది.
Also Read: బహిరంగ సభలో మహిళా నాయకురాలిని ముద్దాడిన సేన ఎమ్మెల్యే..! వీడియో వైరల్.. ఇద్దరు నిందితుల అరెస్ట్
దీంతో ఆ కుక్క గింజుకుంటూ ప్రాణాలు వదిలిపెట్టింది. కుక్క గింజుకోవడం ఆపేశాక అలాగే నోట్లో కరుచుకునే చిరుత పులి దాన్ని తీసుకెళ్లింది. ఈ భయానక వీడియో వెన్నులో వణుకు పుట్టిస్తున్నది.
ఆ చిరుత పులి చాలా కాలంగా జనబాహుళ్యంలో తిరుగుతున్నదని చెప్పారు. దాన్ని ట్రాప్ చేసి పట్టుకుని అడవిలోకి పంపించాలని తాము పలుమార్లు అటవీ శాఖకు చెప్పామని, కానీ వారు తమ విన్నపాలను పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు.