అస్త్ర క్షిపణిని  గోవా తీరంలో  విజయవంతంగా ప్రయోగించారు.  తేజస్ యుద్ధ విమానం నుండి ఈ ప్రయోగాన్ని  విజయవంతం చేశారు.


న్యూఢిల్లీ: తేజస్ యొక్క లైట్ కాంబట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎల్ఎస్‌పీ-7 ను బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని బుధవారం నాడు విజయవంతంగా ప్రయోగించారు. తేజస్ యుద్ధ విమానం నుండి క్షిపణిని విజయవంతంగా జరిగింది.

స్వదేశీ యుద్ధ విమానం తేజస్ నుండి అస్త్ర క్షిపణి విజయవంతంగా పరీక్షించారు. అస్త్ర అనేది విజువల్ రేంజ్ బియాండ్ క్షిపణి. త్వరలోనే తేజస్ విమానానికి ఈ క్షిపణిని అమర్చనున్నారు.దీంతో శత్రువులను తేజస్ విమానం పోరాటం చేయనుంది. గోవా బీచ్ ప్రాంతంలో అస్ట్రా మిస్సైల్ ను పరీక్షించారు.
తేజస్ యుద్ధ విమానం దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో ఈ మిస్సైల్ ను పరీక్షించింది. ఈ పరీక్ష విజయవంతమైందని డీఆర్‌డీఓ తెలిపింది. అస్త్ర అనేది అత్యాధునిక బీవీఆర్ క్షిపణి. యుద్ధ విమానాల నుండి నిర్ధేశిత లక్ష్యాలను అస్త్ర చేధించనుంది. డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ, ఆర్‌సీఐ , ఇతర ఏజెన్సీలు అస్త్ర క్షిపణిని అభివృద్ధి చేశాయి.

ఈ మిస్సైల్ అన్ని నిర్ధేశిత లక్ష్యాలను చేరుకుందని అధికారులు చెప్పారు.ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, డీఆర్‌డీఓ, హెచ్ఏఎల్ శాస్త్రవేత్తలతో పాటు సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్ డైరెక్టరేట్ జనరల్ అధికారులు ఈ ప్రయోగాన్ని పరీక్షించారు.

అస్త్ర పరిధిలో 100 కి.మీ కంటే ఎక్కువగా ఉంటుంది. యుద్ధ సమయంలో బీవీఆర్ క్షిపణులు చాలా కీలకంగా వ్యవహరించనున్నాయి.తేజస్ విమానాన్ని భారత వైమానిక దళం పాకిస్తాన్ కు సరిహద్దుకు సమీపంలో ఎయిర్ బేస్ వద్ద మోహరించింది. పాకిస్తాన్ నుండి యుద్ద విమానాలు వస్తే తేజస్ యుద్ద విమానం అడ్డగించి గాలిలోనే ధ్వంసం చేయడం తేజస్ బాధ్యత. తేజస్ నుండి అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో తేజస్ బలం మరింత పెరగనుంది.తేజస్ ఎల్‌సీఏ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన అధికారులను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.