Asianet News TeluguAsianet News Telugu

కోర్టు విచారణ జరుగుతుండగా అర్ధనగ్న ప్రదర్శన.. కోర్టు ధిక్కరణగా ఫిర్యాదు

కోర్టులో ఓ కేసులో వర్చువల్‌గా వాదనలు వినిపిస్తుండగా ఓ వ్యక్తి అర్ధనగ్నంగా తెర మీద దర్శనం ఇచ్చాడు. దీంతో అప్పుడు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్‌కు అంతరాయం కలిగింది. దీనిపై ఆమె రిపోర్ట్ చేసినప్పటికీ 20 నిమిషాలు ఆ వ్యక్తి అలాగే అర్ధనగ్నంగా కనిపించారని పేర్కొంది. దీనిపై కర్ణాటక హైకోర్టు సదరు వ్యక్తికి నోటీసులు పంపింది. అయితే, ఈ ఘటనను తాను సీరియస్‌గా తీసుకుంటున్నారని, కోర్టు ధిక్కరణగా, లైంగిక వేధింపుల ఆరోపణలతో అధికారికంగా ఫిర్యాద చేయబోతున్నట్టు ఇందిరా జైసింగ్ అన్నారు.
 

lawyer indira jaising raised objection as a semi naked man came on screen
Author
Bengaluru, First Published Nov 30, 2021, 7:00 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి(coronavirus pandemic) కారణంగా ఇప్పటికీ కోర్టులు(Court) పూర్తిస్థాయిలో ప్రత్యక్ష విచారణలు చేపట్టడం లేదు. కొన్ని కేసులను ప్రత్యక్షంగా విచారిస్తుండగా, కొన్ని కేసులను వర్చువల్ (Virtual hearing) విధానంలో విచారిస్తున్నది. వర్చువల్ విధానంలో విచారిస్తున్నప్పుడు కొన్ని అభ్యంతరకర దృశ్యాలు తెర మీదకు వచ్చిన ఉదంతాలు ఇప్పటికే కొన్ని సార్లు విన్నాం. ఒక్కోసారి న్యాయవాది అభ్యంతరకరంగా కనిపించడం లేదా మరెవరో కనిపించడం వంటి ఇబ్బందులు వచ్చాయి. ఓ విచారణలో ఏకంగా ఓ న్యాయవాది పొగతాగుతూ తెర మీద దర్శనం కావడం కలకలం రేపింది. తాజాగా, కర్ణాటక హైకోర్టు ఓ కేసు విచారిస్తుండగా ఓ వ్యక్తి అర్ధనగ్నంగా దర్శనం ఇచ్చారు. 

కర్ణాటక హైకోర్టు వర్చువల్‌గా విచారిస్తుండగా ఓ వ్యక్తి సుమారు 20 నిమిషాలు అర్ధనగ్నంగా కనిపించారు. అదే కేసులో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్(Senior Lawyer Indira Jaisingh) కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఆమె వెంటనే ఆ అర్ధనగ్న ప్రదర్శనను రిపోర్ట్ చేశారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ చర్య కోర్టు ధిక్కరణగా ఆమె పేర్కొన్నారు. ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కోర్టు కూడా స్పందించింది సదరు వ్యక్తికి నోటీసులు పంపింది.

తాను అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ స్క్రీన్‌పై ఆ వ్యక్తి 20 నిమిషాలు కనిపించారని సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ అన్నారు. దీనిపై తాను అధికారికంగా కోర్టు ధిక్కరణ, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేయబోతున్నట్టు ఆమె వెల్లడించారు. కోర్టులో వాదిస్తున్నప్పుడు ఇలాంటి ఘటనలు తీవ్రంగా అంతరాయం కలిగిస్తాయని వివరించారు.

Also Read: Fastest Trial : ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం.. ఒక్కరోజులో తీర్పు ఇచ్చిన బీహార్ కోర్ట్..

సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ వాదిస్తుండగా ఓ వ్యక్తి తెర మీద సుమారు 20 నిమిషాలు అర్ధనగ్నంగా కనిపించారని ఆమె ఆరోపించారు. తద్వార ఆమెకు తీవ్ర అంతరాయం వాటిల్లినట్టు తెలిపారు. ఒక మహిళా న్యాయవాదికి అలాంటి ఘటనలు ఎదురైనప్పుడు తీవ్రంగా కలత చెందుతారని ఆమె వివరించారు. దీనిపై ఇందిరా జైసింగ్ ఫిర్యాదు చేశారని కర్ణాటక హైకోర్టు తెలిపింది. దీనిపై సదరు వ్యక్తికి నోటీసులు పంపినిట్టూ కోర్టు వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios