Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: విదేశాల నుండి వచ్చిన వరుడు, పెళ్లికి అధికారుల అభ్యంతరం

కరోనా ఎఫెక్ట్ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ జంట పెళ్లికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. చావు బతుకుల మధ్య ఉన్న తండ్రి కళ్ల ముందే పెళ్లి చేసుకోవాలన్న కొడుకు ఆశకు అధికారులు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. 

corona effect: Revenue officials asks stop marriage in Yadadadri Bhuvanagiri district
Author
Hyderabad, First Published Mar 19, 2020, 1:31 PM IST

వలిగొండ: కరోనా ఎఫెక్ట్ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ జంట పెళ్లికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. చావు బతుకుల మధ్య ఉన్న తండ్రి కళ్ల ముందే పెళ్లి చేసుకోవాలన్న కొడుకు ఆశకు అధికారులు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. పెళ్లిని వాయిదా వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు పెళ్లిని ఎందుకు వాయిదా వేసుకోవాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన ఓ యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇదే జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి మండలానికి చెందిన యువతితో ఏడాది క్రితమే పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పెళ్లి చేయాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు.

అయితే వరుడి తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పెళ్లిని ఏప్రిల్ మాసం నుండి మార్చి 20వ తేదీకి మార్చారు. దీంతో అమెరికా నుండి యువకుడు నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. 

అమెరికా నుండి వచ్చిన యువకుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే  అతనికి నెగిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా విదేశాల నుండి వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ కు తరలించాలని అధికారులు గుర్తు చేస్తున్నారు.

Also read:కరోనా ఎఫెక్ట్: కవలలకు దూరమైన తల్లి, స్వదేశం వచ్చేందుకు ప్రయత్నాలు

ఈ పెళ్లి కోసం రెండు కుటుంబాలు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి  పత్రికలను పంచారు. అయితే ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పెళ్లిని వాయిదా వేసుకోవాలని సూచించారు. 

కానీ అమెరికా నుండి వచ్చిన యువకుడికి కరోనా వ్యాధి లక్షణాలు నెగిటివ్ అని రావడంతో పెళ్లి చేయడానికి ఇబ్బంది ఏముందని రెండు కుటుంబాల పెద్దలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios