Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్ లో విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురు మృతి, ఆరుగురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది

జమ్మూ కాశ్మీర్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. కొండ చరియల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Landslides broke out in Jammu and Kashmir.. 4 dead, 6 rescued by rescue personnel
Author
First Published Oct 30, 2022, 9:00 AM IST

జమ్మూ కాశ్మీర్ లో నిర్మాణంలో ఉన్న రాట్లే పవర్ ప్రాజెక్టు స్థలంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో నాలుగురు మృతదేహాలను వెలికితీశామని, మొత్తం ఆరుగురిని రక్షించామని జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ దేవాన్ష్ యాదవ్ తెలిపారు. సహాయక చర్యలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

12 ఏళ్ల బాలికపై మైనర్ బాలుర గ్యాంగ్ రేప్.. ఫోన్లో చిత్రీకరణ..డబ్బుల కోసం బ్లాక్ మెయిల్..సోషల్ మీడియాలో పోస్ట్

కాగా.. ఈ ఘటనలో చిక్కుకున్న వారికి సాయం చేయడానికి స్థానికులు పరిగెత్తారు. అయితే ఆ సమయంలో దురదృష్టవశాత్తు మరికొన్ని కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇదిలా ఉండగా.. కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్ లోని డీసీ కిష్త్వార్ తో తాను మాట్లాడినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

‘‘చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరమైన సాయం అందిస్తున్నాం. జిల్లా యంత్రాంగంతో నేను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు కాగా.. సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లిన ఆరుగురి సభ్యులతో కూడిన 6 గురితో కూడిన రెస్క్యూ బృందం కూడా శిథిలాల కింద చిక్కుకుందని జేసీబీ డ్రైవర్ సింగ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios