హర్యానాలో విరిగిపడిన కొండచరియలు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న మరో 15 మంది!
హర్యానాలో బివానీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తోషమ్ బ్లాక్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో గనుల తవ్వకాలు జరుపుతున్న కార్మికులు, యంత్రాలు, భారీ వాహనాలూ శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఈ శిథిలాల కింద సుమారు 15 మంది చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. సహాయక సిబ్బంది ఇప్పటికే ఘటనా స్థలికి చేరుకుంది. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీసినట్టు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మరణించినట్టు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి రాష్ట్ర మంత్రి జేపీ దలాల్ స్పాట్‌కు చేరుకున్నారు.
చండీగడ్: హర్యానా(Haryana)లో నూతన సంవత్సరం అడుగుపెట్టిన తొలి రోజే ఘోర ప్రమాదం జరిగింది. భివానీ జిల్లాలో మైనింగ్ జోన్(Minign Zone)లో కొండ చరియలు(Landsides) విరిగిపడ్డాయి. మైనింగ్ జరుగుతుండటంతో చాలా పెద్ద పెద్ద కొండలు నిటారుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవి ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఆ కొండ చరియల కింద గనుల తవ్వకానికి ఉపయోగించే భారీ వాహనాలు కూడా చిన్న చిన్న బొమ్మలుగా చిక్కుకుపోయాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. శిథిలాల కిందే సుమారు 15 నుంచి 20 మంది చిక్కుకున్నట్టు సమాచారం. అయితే, ఈ ఘటన గురించి తెలియగానే అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. ఇప్పటి వరకు శిథిలా కింది నుంచి మూడు మృతదేహాలను వెలికి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలికి అంబులెన్స్‌లు కూడా చేరుకున్నాయి.
బివానీ జిల్లాలో తోషం బ్లాక్ దగ్గర మైనింగ్ పనులు జరుగుతున్నాయి. దదామ్ మైనింగ్ బ్లాక్‌లో ఈ ప్రమాదం జరిగింది. భారీ కొండ ఒకటి క్రాక్ అయిపోయి ఉన్నపళంగా కూలిపోయింది. దీంతో కింద పని చేస్తున్న కార్మికులు, వాహనాలు, మెషీన్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. కొన్ని యంత్రాలైతే నుజ్జునుజ్జు అయ్యాయి. ఇప్పటికైతే.. కొండ చరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనా విషయం తెలియగానే హర్యానా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ స్పాట్‌కు చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Myanmar Landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. జాడే మైన్‌లో విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు
కొంత మంది చనిపోయారు: మంత్రి
స్పాట్‌కు చేరుకున్న మంత్రి కీలక సమాచారం వెల్లడించారు. ఈ ప్రమాదంలో కొందరు మరణించారని తెలిపారు. అయితే, ఎంత మంది చనిపోయింది.. ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని అన్నారు. వీలైనంత ఎక్కువ మందిని రక్షించడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.
దురదృష్టకరం: సీఎం
భివానీలోని దదామ్ మైనింగ్ జోన్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనతో కలత చెందానని, ఈ ఘటన దురదృష్టకరం అని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ తెలిపారు. సహాయక చర్యలు వేగంగా జరగడానికి, క్షతగాత్రులకు సరైన సహాయం అందించడానికి తాను స్థానిక అధికార యంత్రాంగంతో టచ్‌లో ఉన్నారని ట్వీట్ చేశారు.