ముంబై: నిసర్గ తుఫాన్ అలీబాగ్ వద్ద బుధవారం నాడు మధ్యాహ్నం తీరాన్ని తాకింది. తుఫాన్ తీరాన్ని దాటడానికి సుమారు మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిసర్గ తుఫాన్ ప్రభావంతో ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో అలీబాగ్ వద్ద నిసర్గ తుఫాన్ నిసర్గ తుఫాన్ తీరాన్ని దాటింది. ఈ తుఫాన్ గుజరాత్, మహారాష్ట్రలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. తుపాన్ తీరాన్ని దాటే సమయంలో 120 నుండి 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

also read:దూసుకొస్తున్న నిసర్గ తుఫాన్: నేడు అలీబాగ్ వద్ద తీరం దాటనున్న సైక్లోన్

ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటల వరకు కూడ తీరాన్ని దాటే అవకాశం ఉందని నిపుణులు ప్రకటించారు.  ఈ రెండు రాష్ట్రాల్లో 43 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు.

తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

రెండు రోజుల పాటు ప్రజలు ఎవరూ కూడ బయటకు రావొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని థానే, దుర్గ్, రాయ్‌ఘడ్, రత్నగిరి, పాల్‌గర్, సింధు జిల్లాల్లో ఈ తుఫాన్ ప్రబావం కన్పించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు ప్రకటించారు.