భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్ 3 చందమామ వైపు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోగానే విక్రమ్ ల్యాండర్ ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు విజయవంతంగా అన్ని దశలను పూర్తి చేసిన చంద్రయాన్ 3 చివరి దశకు చేరుకుంది. చంద్రుడికి మరింత చేరవైంది. తాజాగా ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ల్యాండర్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ.. తన కార్యచరణకు ప్రారంభించింది. ఇందులో భాగంగా చంద్రుడిని తొలి సారిగా అత్యంతం సమీపం నుంచి ఫోటోలు తీసి.. ఇస్రోకు పంపింది. 

ఈ ఫోటోలను ఇస్రో శాస్త్రవేత్తలు కొద్దిసేపటి కిందటే తమ అధికారిక ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ రోవర్ ఈ ఫోటోలను ఈ నెల 15వ తేదీన తీసినట్టు తెలుస్తోంది. ల్యాండర్‌కు అమర్చిన హై-డెఫినిషన్ కెమెరా తీసిన ఈ చిత్రాల్లో చంద్రుడి ఉపరితలంపై ఉన్న కొండలు, లోయలు స్పష్టంగా చూడవచ్చు. ఈ చిత్రాలన్నింటినీ కలిపి ఇస్రో శాస్త్రవేత్తలు ఓ వీడియోను తయారు చేశారు. 31 సెకండ్ల వ్యవధి గల ఈ వీడియోను ఇస్రో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గతంలో అంతరిక్ష ప్రయోగ సంస్థలు గుర్తించిన ఫ్యాబ్రి, హర్ఖెబి జే, గెర్డానో బ్రూనో లను ఆ ఫోటోలో చూడవచ్చు.

అంతకుముందు.. చంద్రయాన్ -3 యొక్క ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా వేరు చేయబడినట్లు ఇస్రో గురువారం తెలిపింది. ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ఇప్పుడు చంద్రుని ఉపరితలానికి మరింత దగ్గరగా చేరువైంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…