Asianet News TeluguAsianet News Telugu

భార‌త్ లో 'టొమాటో ఫ్లూ' డేంజర్ బెల్స్.. 108 మంది చిన్నారులకు ముప్పు.. ఈ వ్యాధి ల‌క్ష‌ణాలివే..!

భారత్​లో మరో వైరస్ కలకలం రేపుతోంది. అదే.. టొమాటో ఫ్లూ వైరస్. ఈ వైర‌స్ కేరళ, ఒడిశాలలో విజృంభిస్తోంది. ప్ర‌ధానంగా ఈ వ్యాధి  ఐదేళ్లలోపు పిల్లలకు సోకుతుందని ది లాన్సెట్ అధ్యయనంలో తెలిపింది.

Lancet Study Warns Of Tomato Flu  New Viral Infection In India,
Author
Hyderabad, First Published Aug 21, 2022, 12:29 AM IST

కరోనా మహమ్మారి, మంకీపాక్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ఎదుర్కొంటున్న భారత్ మరొక తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది. అదే టొమాటో ఫ్లూ అనే వైరస్. ఈ వైర‌స్ కేరళ, ఒడిశాలలో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఇప్పటివరకు కేరళలో  82మంది చిన్నారులకు వ్యాపించింది. అలాగే.. ఒడిశాలో 26మంది చిన్నారులు ఈ   వ్యాధి బారిన పడ్డారని ప్రముఖ 'ది లాన్సెట్‌' జర్నల్‌ ప్రస్తావించింది.

మే 6వ తేదీ నుంచి నేటీ వ‌ర‌కు కేరళలో 82మందిలో బ‌య‌ట‌ప‌డింది. ఇందులో ప్ర‌ధానంగా ఐదేళ్లలోపు పిల్లలేనని వెల్లడించింది. కరోనా మ‌హ‌మ్మారి నాలుగో వేవ్ వెలుగులోకి వ‌చ్చిన సమయంలో కేరళలో టొమాటో ఫ్లూ అనే కొత్త వైరస్ బ‌య‌ట‌ప‌డింద‌ని  లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ తెలిపింది. కేరళలో ఈ కేసుల‌ సంఖ్య పెరుగుతుండ‌టంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయ‌ని నివేదిక వెల్ల‌డించింది. ది లాన్సెట్ నివేదిక ప్ర‌కారం.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తంగా 108 కేసులు నమోదైనట్లు వెల్లడి అయిన‌ట్టు నివేదిక తెలిపింది. 

కేరళ ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. అంటువ్యాధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అజాగ్రత్తగా ఉండవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారని, దీనిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. టొమాటో జ్వరం అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి మరియు దానిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.

టొమాటో ఫ్లూ అంటే ఏమిటి?

టొమాటో జ్వరం లేదా టొమాటో ఫ్లూ ని హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (HFMD) ​అని కూడా అంటారు. ఇది అరుదైన వైరల్ వ్యాధి. ఈ వైర‌స్ వ‌ల్ల శరీరం అంతటా దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. దీనికి టమోటాలు తినడంతో సంబంధం లేదు, కానీ పరిమాణం, రంగు పరంగా టమోటా దద్దుర్లు సారూప్యత కారణంగా దాని పేరు వచ్చింది.

ఎవ‌రికీ ఎక్కువ ప్రమాదం 

టొమాటో జ్వరం అనేది ప్రధానంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చూపుతోంద‌ని నిపుణులు భావిస్తున్నారు. టమోటా జ్వరం ఎలా వ్యాప్తి చెందుతోంద‌నేది అస్పష్టంగా ఉంది. అయితే.. ఇది అరుదైన వైరల్ వ్యాధిగా పరిగణించబడుతుంది. ఈ వ్యాధి ప్రాణాపాయం లేదా ప్రాణాంతకం కానప్పటికీ.. ఇది చాలా అంటువ్యాధి అని చెప్పబడింది.

టమోటా ప్లూ సంకేతాలు

టొమాటో ప్లూ వ‌ల్ల చర్మంపై ఎర్రటి పొక్కులు, దద్దుర్లు, చికాకు, నిర్జలీకరణం జ‌రుగుతుంది. అలాగే.. అధిక జ్వరం, శరీర నొప్పులు, వాపు కీళ్ళు, అలసట, పొత్తికడుపు తిమ్మిరి, అతిసారం, వాంతులు సంభ‌విస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం..దగ్గు, జలుబు కూడా క‌నిపించ‌వ‌చ్చు. 

 టొమాటో ఫ్లూ యొక్క‌ చాలా కేసులు పిల్లలలో నివేదించబడ్డాయి, కాబట్టి వాటిని సురక్షితంగా ఉంచడం ప్రాధాన్యతనివ్వాలి. ఈ వ్యాధి కరోనా లేదా మంకీపాక్స్ కంటే చాలా ఎక్కువ లేదా ప్రమాదకరమైనది అయినప్పటికీ.. దాని గురించి ఇంకా ఏమీ చెప్పలేం. దీన్ని తేలికగా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు.. ఈ వ్యాధి వ‌ల్ల‌ ఎటువంటి మరణాలు సంభ‌వించ‌లేదు. 

పిల్లలపై ప్రభావితం 
 
నివేదికల ప్రకారం.. చికున్‌గున్యా మాదిరిగా.. టమోటా జ్వరం కూడా పిల్లల చర్మంపై ఎరుపు, దురద దద్దుర్లు లేదా బొబ్బలు క‌నిపిస్తాయి. ప్రభావిత ప్రాంతాన్ని గోకడం లేదా తాకడం మానుకోండి. ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే.. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
 

Follow Us:
Download App:
  • android
  • ios