'ఆ విషయంలో బీజేపీకి పిచ్చి పట్టింది '
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం స్పందిస్తూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ పిచ్చిగా వ్యవహరిస్తోందని అన్నారు.

సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోన్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో సహా విపక్షాలు నిరంతరం ముట్టడిస్తోన్నాయి. దీంతో పాటు 'భారత్- ఇండియా వివాదం' పై కూడా పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇదే సమయంలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ఈ అంశంపై గురువారం ఓ ప్రకటన చేశారు. బీజేపీది కపట ప్రేమ అని, ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తున్నందుకే బీజేపీ పిచ్చిగా వ్యవహరించిందని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, 'ఈ అంశాన్ని కట్టుకథలు చేస్తుండటంతో బీజేపీ ఉలిక్కిపడిందని, రామ్ అయినా రహీం అయినా మనందరికీ సర్వశక్తిమంతుడు ఒక్కడే' అని అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులను శ్రీకృష్ణుడు పరిష్కరిస్తాడని లాలూ యాదవ్ అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ వ్యతిరేకి
అదే సమయంలో, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటనపై, అతను రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. గురు గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్‌లో ఏది రాశారో, ప్రధాని నరేంద్ర మోడీ అదే చేస్తున్నారు. మోహన్ భగవత్ అదే చేస్తున్నారు. ఇక్కడ కూడా రిజర్వేషన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బంచ్ ఆఫ్ థాట్స్‌లో కూడా రాశారు.
ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
సనాతన ధర్మంపై డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటన వల్ల దేశంలో అలజడి ఆగే సూచనలు కనిపించడం లేదు. వివాదాస్పద ప్రకటన వెలువడిన తర్వాత మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై బీజేపీ, సాధువులు విరుచుకుపడుతున్నారు. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూలతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్, ఇలాంటి వాటిని వ్యతిరేకించవద్దని, నాశనం చేయాలని అన్నారు. అదే సమయంలో ఈ ప్రకటన వల్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు చిక్కుల్లో పడ్డారు.