లాలు ప్రసాద్ యాదవ్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రశంసలు.. ‘సామాజిక న్యాయం కోసం మడమతిప్పని వీరుడు’

లాలు ప్రసాద్ యాదవ్ పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. సామాజిక న్యాయం కోసం మడమతిప్పని వీరుడు లాలు ప్రసాద్ యాదవ్ అని పేర్కొన్నారు.
 

lalu prasad yadav is warrior for self respect says tamil nadu cm mk stalin kms

చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ సుప్రీమ్ లీడర్ లాలు ప్రసాద్ యాదవ్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. సామాజిక న్యాయం కోసం మడమతిప్పకుండా పోరాడిన వీరుడు అంటూ ట్వీట్ చేశారు. లాలు ప్రసాద్ యాదవ్ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంకే స్టాలిన్ ఆదివారం ట్వీట్ చేశారు. లాలు ప్రసాద్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ వివరించారు.

ఆయన ప్రజల జీవితాలకు ఇచ్చిన గౌరవం ఇచ్చిన ప్రాధాన్యత గొప్పదని ఆయన తెలిపారు. ఆయన రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తే ఇక్కడ పెరియార్ చేసిన ఆత్మ గౌరవ ఉద్యమానికి ఏమాత్రం తీసిపోదని వివరించారు. అది వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల విషయమైనా, కుల గణన అయినా, లౌకికత్వాన్ని ఎత్తిపట్టడమైనా ఆయన కమిట్‌మెంట్ అమోఘం అని పేర్కొన్నారు. ఇవన్నీ ఆయనను సామాజిక న్యాయం కోసం వెన్ను చూపని యోధుడిగా నిలిపాయని వివరించారు.

Also Read: మళ్లీ బీజేపీ గెలిస్తే.. నరేంద్ర మోడీ నరేంద్ర పుతిన్‌గా మారుతారు.. ఇక ఎన్నికలే ఉండవు: పంజాబ్ సీఎం

లాలు ప్రసాద్ యాదవ్ మరిన్ని సంవత్సరాలు క్రియాశీలకంగా సాగాలని సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. ఉత్తర భారతంలో మండల్ పాలిటిక్స్‌ను బలోపేతం చేయాలని ఆశిస్తున్నట్టు వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios