'మోమోస్-పిజ్జాలను ఆస్వాదించే చోటు కోసం మోదీ వెతుకుతున్నారు'.. ప్రధానిపై లాలూ సైటర్లు..
వచ్చే నెలలో ముంబైలో జరగనున్న తదుపరి ప్రతిపక్ష సమావేశం ( INDIA) కోసం తాను ఎదురు చూస్తున్నానని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి తాను హాజరవుతానని లాలూ చెప్పారు.

Lalu Prasad: ప్రధాని మోడీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూ యాదవ్ విమర్శాస్త్రాలు సంధించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటమి పా ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చెందుతున్నారని, ప్రధాని ఓటమి పాలైతే విదేశాల్లోనే సెటిలవుతారని, సరైన స్థానం కోసం చూస్తున్నారని లాలూ యాదవ్ ఆదివారం పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం మోదీ క్విట్ ఇండియాపై లాలూ యాదవ్ స్పందిస్తూ.. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కూడిన ఐఎన్‌డీఐఏ కూటమిని ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
'మోదీ విదేశాల్లో స్థిరపడతారు'
వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ అధికారం కోల్పోతారనీ, ఓటమి తర్వాత మోదీ విదేశాల్లో స్థిరపడతారని లాలూ యాదవ్ ఆరోపించారు. అందుకే ప్రధాని మోడీ చాలా దేశాలు సందర్శిస్తున్నారనీ, ఆయన విశ్రాంతి తీసుకుంటూ.. పిజ్జా, మోమోస్,చౌమీన్‌లను ఆస్వాదించడానికి సరైన స్థలం కోసం చూస్తున్నరని ఎద్దేవా చేశారు. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నిర్వహించిన కార్యక్రమానికి లాలూ యాదవ్ హాజరయ్యారు.
వచ్చే నెలలో ముంబైలో జరగనున్న I.N.D.I.A. తదుపరి సమావేశం కోసం తాను ఎదురు చూస్తున్నానని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి తాను హాజరవుతానని లాలూ చెప్పారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని, అయితే ఈ ప్రయత్నాన్ని విఫలం చేస్తామని ఆర్జేడీ అధినేత ఆరోపించారు. ఐక్యతను కాపాడుకుంటూ బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాడు. అలాగే.. మణిపూర్‌లో మహిళలపై వేధింపుల ఘటనను ప్రస్తావిస్తూ.. అక్కడ జరుగుతున్న పోరాటానికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ , అతని పార్టీ జనతాదళ్ యునైటెడ్ జూన్ 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రెండవ సమావేశం బెంగళూరులో జూలై 17-18 తేదీలలో జరిగింది, కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ఆతిథ్యమిచ్చింది.