Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri Violence : ప్రియాంక గాంధీ అరెస్ట్, అఖిలేష్ యాదవ్ హౌస్ అరెస్ట్..

మరోవైపు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఘటన నేపథ్యంలో సోమవారం దేశవ్యాప్తంగా రైతుల సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. లఖీమ్ పూర్ ఖేరీ ఘటనమీద రైతుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 

Lakhimpur Kheri Violence : Priyanka Gandhi arrest and akhilesh yadav house arrest in
Author
Hyderabad, First Published Oct 4, 2021, 11:19 AM IST

లక్నో : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని లఖీమ్ పూర్ ఖేరీలో (Lakhimpur Kheri) ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనను ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. లఖీమ్ పూర్ ఖేరీలో రాజకీయ నేతల ప్రవేశంపై పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. లఖీమ్ పూర్ ఖేరీ వెళ్లేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Arrest) యత్నించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 

మరోవైపు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఘటన నేపథ్యంలో సోమవారం దేశవ్యాప్తంగా రైతుల సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. లఖీమ్ పూర్ ఖేరీ ఘటనమీద రైతుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 

నిన్నకేంద్రమంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహంతో వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారుల దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్ మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతుల మీదికి కారు తోలడాన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (కుమారుడిపై హత్య కేసు నమోదైంది. 

UP Violence : కేంద్రమంత్రి కొడుకుపై మర్డర్ కేస్.. రైతుల మీదికి కారు ఎక్కించిన ఘటనలో 4 రైతులతో సహా 8 మంది మృతి

ఈ కేసుకు సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో మంత్రి కుమారుడితో పాటు ఇంకా ఇతర వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, అందులో నలుగురు రైతులు ఉన్నారు. రైతుల ఆందోళన మీద ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా చేసిన వ్యాఖ్యలతో వారు తీవ్రంగా అసంతృప్తి చెందారు. దీంతో  ఇద్దరు మంత్రుల పర్యటనను అడ్డుకోవడానికి రైతులు సమావేశమయ్యారు. గత నెలలో, మిశ్రా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళన మీద విమర్శలు గుప్పించారు. ఇది "10-15 మంది మాత్రమే చేస్తున్న నిరసన అని, తలుచుకుంటే వారిని లైన్‌లో ఉంచడానికి కేవలం రెండు నిమిషాలు చాలు" అని అన్నారు.

ఈ వ్యాఖ్యలతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతియుతంగా జరుగుతున్న తమ ఆందోళన మీద ఇలాంటి వ్యాఖ్యలతో వారు విసిగిపోయారు. దీంతో "మంత్రుల రాకను ఆపడానికి రైతులు హెలిప్యాడ్‌ను ఘెరావ్ చేయాలనుకున్నారు. ఘెరావ్ పూర్తయ్యాక.. రైతులు తిరిగి వెళ్తుండగా, మూడు కార్లు చాలా వేగంగా వచ్చాయి. నడిచి వెడుతున్న రైతుల మీదికి దూసుకువెళ్లాయి. ఈ ఘటనలో ఒక రైతు అక్కడికక్కడే మరణించాడు. మరొకరు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు "అని రైతు సంఘం నాయకుడు డాక్టర్ దర్శన్ పాల్ అన్నారు. రైతుల మీదికి నడిపిక కారులో మంత్రి కుమారుడు ఉన్నాడని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios