కిడ్నీలో 1,72,155 రాళ్లు.. గిన్నిస్ బుక్‌లోకి భారతీయుడు

lakh kidney stones removed doctors
Highlights

 కిడ్నీలో 1,72,155 రాళ్లుంటే ఇంకేమైనా ఉందా..? గిన్నిస్ ‌బుక్ వాళ్లే అవాక్కవ్వడంతో.. ఈ అరుదైన ఘటన రికార్డుల్లోకి ఎక్కింది. అది సాధించింది భారతీయుడే కావడం గమనార్హం

కిడ్నీలో ఒకటి రెండు రాళ్లుంటేనే మనుషులు తట్టుకోవడం కష్టం. వెన్నునొపి, పొత్తికడుపు నొప్పితో మనిషి గిలగిలా కొట్టుకుంటాడు. అలాంటిది ఏకంగా మూడు వేల రాళ్లుంటే..  ఆ వ్యక్తి పడే నరకయాతన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైనాలోని షాంగైకి చెందిన మహిళ గత కొంత కాలం నుంచి వెన్నునొప్పి తట్టుకోలేకపోతోంది. ప్రతిరోజూ జ్వరంతో పాటు వెన్నునొప్పి తాళలేకపోతోంది..

ఎన్ని బిళ్లలు మింగినా ఫలితం లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లింది.. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాకయ్యారు.. మహిళ కుడి మూత్రపిండంలో వేల సంఖ్యలో రాళ్లున్నాయని గుర్తించారు. శస్త్రచికిత్స చేసి కొన్ని గంటల పాటు శ్రమించి కిడ్నీ నుంచి సుమారు 3000 రాళ్లను తొలగించారు..

దీనికే మీరు వామ్మో అని ముక్కున వేలేసుకోకండి.. కిడ్నీలో 1,72,155 రాళ్లుంటే ఇంకేమైనా ఉందా..? గిన్నిస్ ‌బుక్ వాళ్లే అవాక్కవ్వడంతో.. ఈ అరుదైన ఘటన రికార్డుల్లోకి ఎక్కింది. అది సాధించింది భారతీయుడే కావడం గమనార్హం.. మహారాష్ట్రకు చెందిన ధన్‌రాజ్‌ వాడిలేకి పరీక్ష చేసి నిర్ఘాంతపోయారు.. ధన్‌రాజ్‌ కిడ్నీలో లక్షన్నర పైగా రాళ్లున్నాయని గుర్తించి ..1,72,155 రాళ్లను సర్జరీ ద్వారా తొలగించారు. అప్పట్లో ఈ సంఘటన వైద్య ప్రపంచంలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న గిన్నిస్ ప్రతినిధులు అతని పేరును రికార్డుల్లోకి ఎక్కించారు. 

loader