లేడీడాన్ ‘భూరీ’ అరెస్ట్ : అసలు ఏం జరిగింది (వీడియో)

Lady Don Bhuri Again Spreading Terror in Streets of Surat, watch Viral Video
Highlights

 లేడీడాన్  ‘భూరీ’ అరెస్ట్ : అసలు ఏం జరిగింది  (వీడియో) 

బహిరంగంగా మారణాయుధాలు పట్టుకుని తిరుగుతూ, బెదిరింపులకు పాల్పడుతున్న లేడీ‌డాన్ ‘భూరీ’ని గుజరాత్‌లోని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ లేడీ‌డాన్ తన అనుచరునితో కలిసి ఒక యువకుడిని కత్తితో బెదిరించి బైక్ అపహరించారు. అలాగే ఒక పాన్ దుకాణంలో రూ. 500 లాక్కున్నారనే ఆరోపణలున్నాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూరత్‌లోని హేమకుంజ్ సొసైటీ నివాసి మహేష్ కాలూ కజారియా కుమారుడు చిరాగ్ మోటార్ సైకిల్‌పై ఏదో పనిమీద వెళుతున్నాడు. 

ఇంతలో భూరీ ఉరఫ్ అస్మిత, అతని అనుచరునితో పాటు వచ్చి, కత్తితో చిరాగ్ ను బెదిరించి మోటార్ సైకిల్ తీసుకుని పరారైపోయారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో భూరీ కోసం గాలించి ఎట్టకేలకు అరెస్టు చేశారు.

 

 

 

loader