న్యూఢిల్లీ: భారత  సైనికులపై దాడికి దిగిన చైనాకు తగిన బుద్ది చెప్పాలని శివసేన డిమాండ్ చేసింది. లడ్డాఖ్ సమీపంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన గొడవలో 20 మంది మరణించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై శివసేన స్పందించింది.చైనా దూకుడుకు తగిన బుద్ది చెప్పాలని శివసేన అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ప్రధాని మోడీతోనే ఉంటారని ఆయన చెప్పారు.  మీరు ఎంతో ధైర్యవంతులు,యోధులు, మీ నాయకత్వంలో చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆయన చెప్పారు.

also read:దేశ సార్వభౌమాధికారంపై రాజీ లేదు,సైలెంట్‌గా ఉండబోం: చైనాకు మోడీ వార్నింగ్

చైనా దూకుడు ఎప్పుడు బుద్ది చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఎంతమంది చైనా సైనికులు చనిపోయారని ఆయన ప్రశ్నించారు. ఒక్క బుల్లెట్ పేలకుండానే 20 మంది సైనికులు చనిపోయారు, నిజమేంటో దేశం తెలుసుకోవాలనుకొంటుందని ఆయన ట్వీట్ చేశారు.

లడ్డాఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో సోమవారం నాడు సాయంత్రం ఇండియా, చైనా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలో ఇండియాకు చెందిన 20 మంది ఇండియాకు చెందిన జవాన్లు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ కూడ ఈ ఘటనలో మరణించిన విషయం తెలిసిందే.