న్యూఢిల్లీ: భారత సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సైనికుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు.ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మాడీ బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభ సమయంలో భారత-చైనా సరిహద్దులో 20 మంది జవాన్లు మరణించారు.అమర జవాన్లను స్మరిస్తూ రెండు నిమిషాల పాటు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.

also read:భారత్-చైనా మధ్య ఉద్రిక్తత: 19న అఖిలపక్ష సమావేశానికి మోడీ పిలుపు

ఆ తర్వాత మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఘాటుగానే స్పందించారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం అత్యంత ప్రాధాన్యతాంశాలుగా ఆయన పేర్కొన్నారు. సైనికుల త్యాగాలు వృధాగా పోవని దేశాని హామీ ఇస్తున్నానని చెప్పారు.

భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకొంటుందని చెప్పారు. భారత్ ఎలాంటి వివాదాలను కోరుకోదన్నారు. ధీటుగా బదులిచ్చే విషయంలో కూడ ఏ మాత్రం వెనక్కు తగ్గమని ఆయన హెచ్చరించారు. రెచ్చగొడితే సైలెంట్ గా ఉండబోమని ఆయన తేల్చి చెప్పారు.

'సోమవారం నాడు సాయంత్రం లడ్డాఖ్ వద్ద చైనా, ఇండియా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో ఇండియాకు చెందిన 20 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటనపై చైనా తీరుపై దేేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో చైనా తీరుపై మోడీ తీవ్రంగా స్పందించారు.