తన కుమారుడు బౌద్ధ మహిళతో లేచి పోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం లడఖ్ బీజేపీ చీఫ్ ఫుంచోక్ స్టాంజిన్ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఓ బీజేపీ నేతకు పార్టీ అధిష్టానం ఊహించని షాకిచ్చింది. సదరు బీజేపీ నేత కుమారుడు మరో మతం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో, వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బీజేపీ నేతను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ సంఘటన లడఖ్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లడఖ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్(74). ఆయన చాలా కాలంగా బీజేపీలో నే ఉంటూ, ఆ పార్టీ కోసం కృషిం చేశాడు. అయితే, అతని కుమారుడు ఒక బౌద్ధ మహిళతో కలిసి నెల రోజుల క్రితం పారిపోయాడు. ఈ విషయం తెలిసి, ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించారు.

ఈ విషయాన్ని ఆయన ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. తన కుమారుడు బౌద్ధ మహిళతో లేచి పోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం లడఖ్ బీజేపీ చీఫ్ ఫుంచోక్ స్టాంజిన్ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు.

‘లడఖ్‌లోని మత సామరస్యం, ప్రాంత ప్రజల మధ్య ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నందున పారిపోవడాన్ని అన్ని మత వర్గాల వారు అంగీకరించరు’’ అని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.

నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పటి నుంచి జాడ తెలియలేదు. తన కుమారుడు మంజూర్ అహ్మద్‌కు బౌద్ధ మహిళతో వివాహానికి తన కుటుంబం కూడా వ్యతిరేకమని, గత నెల రోజులుగా వారు ఎక్కడ ఉంటున్నారో తనకు తెలియదని బహిష్కరణకు గురైన బిజెపి నాయకుడు చెప్పారు.

తన కుమారుడు, మహిళ కోర్టులో వివాహం చేసుకున్నప్పుడు సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు దూరంగా ఉన్నానని, అహ్మద్ చెప్పాడు.

"నా కొడుకు వయస్సు 39 సంవత్సరాలు. అతను వివాహం చేసుకున్న మహిళ వయస్సు 35. ఇద్దరూ 2011లో నికాహ్ నిర్వహించారని నేను నమ్ముతున్నాను. గత నెలలో, నేను హజ్ యాత్రకు వెళ్లినప్పుడు వారు కోర్టు వివాహం చేసుకున్నారు" అని ఆయన చెప్పారు.