Asianet News TeluguAsianet News Telugu

క్రమశిక్షణ.. విషయాలపై క్లారిటీ లేదు : కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాలపై సోనియా అసహనం

విధానపరమైన అంశాలపై రాష్ట్ర నాయకత్వానికి స్పష్టత లేదన్నారు కాంగ్రెస్ (congress) అధినేత్రి సోనియా గాంధీ. ఇవాళ జరిగిన ఏఐసీసీ (aicc) సమావేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల్లో (5 state assembly elections) జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. 

Lack Of Clarity Cohesion: Sonia Gandhis Rebuke For Congress Leaders in aicc meeting
Author
New Delhi, First Published Oct 26, 2021, 2:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ధానపరమైన అంశాలపై రాష్ట్ర నాయకత్వానికి స్పష్టత లేదన్నారు కాంగ్రెస్ (congress) అధినేత్రి సోనియా గాంధీ. ఇవాళ జరిగిన ఏఐసీసీ (aicc) సమావేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల్లో (5 state assembly elections) జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. పార్టీ నేతల్లో క్రమశిక్షణతో పాటు ఐక్యత వుండాలని అప్పుడు సంస్థ బలోపేతం అవుతుందని ఆమె అన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాలను అమలు చేయాలని సోనియా గాంధీ సూచించారు. 

నవంబర్ 1వ తేదీ నుంచి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు (membership registration) ప్రారంభించాలని .. ప్రతి గడపకూ వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని సోనియా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త రక్తమే ప్రధానమని ఆమె అన్నారు. యువతకు ఓ వేదికను అందజేయాల్సిన బాధ్యత  మనదేనని సోనియా స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ప్రచారంపై పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని సోనియా ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. 

ALso Read:కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ.. అశోక్ గెహ్లాట్‌ ప్రతిపాదనకు నేతల మద్ధతు, సీడబ్ల్యూసీ నిర్ణయాలివే..!!

అంతకుముందు అక్టోబర్ 16న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ.. "తాను పూర్తి స్థాయి కాంగ్రెస్ అధ్యక్షురాలినేనని, పార్టీ తమ చేతుల్లోనే ఉంది" అనే విషయాన్ని నొక్కిచెప్పారు. 'G-23' అంటూ పార్టీలో చెలరేగుతున్న అసమ్మతులు, విమర్శలకు ఆమె ఇలా చెక్ పెట్టారు. వీరు గత సంవత్సరకాలంగా పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకత్వం కావాలంటూ.. దానికోసం ఎన్నిక నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే Congress Working Committee నేడు సమావేశం అయ్యింది. 

"తానెప్పుడూ ఫ్రాంక్‌నెస్‌ని ప్రశంసిస్తూనే ఉన్నాను", దీనికోసం "మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు" అని 'G -23' విడుదల అయిన లేఖలో రెండు శిబిరాలలోని నాయకుల మధ్య వాగ్వాదానికి దారితీయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఎలాంటి సమస్యల మీదైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రైతుల నిరసనలు, మహమ్మారి సమయంలో సాయం అందించడం, కోవిడ్ ఉపశమనం వంటి జాతీయ సమస్యలపై చర్చించారు. మైనార్టీలపై టెర్రరిస్టుల హత్యాకాండపై ఖండించాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పంజాబ్, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్ తో సహా కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి, ఎలాంటి వ్యూహం పాటించాలని ఈ CWC భేటీలో చర్చించారు. రెండు సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ (rahul gandhi) పార్టీ అధ్యక్ష పదవికి  రాజీనామా చేసినప్పటి నుండి sonia gandhi పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios