Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ.. అశోక్ గెహ్లాట్‌ ప్రతిపాదనకు నేతల మద్ధతు, సీడబ్ల్యూసీ నిర్ణయాలివే..!!

2022 నాటికి కాంగ్రెస్‌లో (congress) సంస్థాగత ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (aicc secretary general) కేసీ వేణుగోపాల్ (kc venugopal) . అధ్యక్ష పదవికి సంబంధించి రాహుల్ గాంధీ పేరును రాజస్థాన్ సీఎం  (rajasthan cm) అశోక్ గెహ్లాట్ (ashok gehlot) నామినేట్ చేశారని వేణుగోపాల్ చెప్పారు. అశోక్ గెహ్లాట్ ప్రతిపాదనకు కాంగ్రెస్ నేతలు మద్ధతు తెలిపారని ఆయన వెల్లడించారు. 

CWC Approved Schedule of Organisational Elections says Congress Leader K C Venugopal
Author
New Delhi, First Published Oct 16, 2021, 4:49 PM IST

2022 నాటికి కాంగ్రెస్‌లో (congress) సంస్థాగత ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (aicc secretary general) కేసీ వేణుగోపాల్ (kc venugopal) . శనివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.  అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడంపై రాహుల్ ఆలోచిస్తానన్నారని ఆయన వెల్లడించారు. అధ్యక్ష పదవికి సంబంధించి రాహుల్ గాంధీ పేరును రాజస్థాన్ సీఎం  (rajasthan cm) అశోక్ గెహ్లాట్ (ashok gehlot) నామినేట్ చేశారని వేణుగోపాల్ చెప్పారు. అశోక్ గెహ్లాట్ ప్రతిపాదనకు కాంగ్రెస్ నేతలు మద్ధతు తెలిపారని ఆయన వెల్లడించారు. అలాగే రాజకీయ పరిస్ధితులు, అధిక ధరలు, రైతు సమస్యలపై తీర్మానాలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని వేణుగోపాల్ చెప్పారు. 

అంతకుముందు శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆసక్తికర అంశాలు చోటుచేసున్నాయి. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ.. "తాను పూర్తి స్థాయి కాంగ్రెస్ అధ్యక్షురాలినేనని, పార్టీ తమ చేతుల్లోనే ఉంది" అనే విషయాన్ని నొక్కిచెప్పారు. 'G-23' అంటూ పార్టీలో చెలరేగుతున్న అసమ్మతులు, విమర్శలకు ఆమె ఇలా చెక్ పెట్టారు. వీరు గత సంవత్సరకాలంగా పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకత్వం కావాలంటూ.. దానికోసం ఎన్నిక నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే Congress Working Committee నేడు సమావేశం అయ్యింది. 

ALso Read:CWC Meet : అసమ్మతులపై సోనియా గాంధీ ఆగ్రహం

రెండు సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ (rahul gandhi) పార్టీ అధ్యక్ష పదవికి  రాజీనామా చేసినప్పటి నుండి sonia gandhi పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమె మాట్లాడుతూ "నేను ఎప్పుడూ ఫ్రాంక్‌నెస్‌ని ప్రశంసిస్తూనే ఉన్నాను", దీనికోసం "మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు" అని 'G -23' విడుదల అయిన లేఖలో రెండు శిబిరాలలోని నాయకుల మధ్య వాగ్వాదానికి దారితీయడాన్ని ఆమె తప్పుపట్టారు.

ఎలాంటి సమస్యల మీదైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేను సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలపై సీరియస్ అయ్యారు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలిని నేనే అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రైతుల నిరసనలు, మహమ్మారి సమయంలో సాయం అందించడం, కోవిడ్ ఉపశమనం వంటి జాతీయ సమస్యలపై చర్చించారు. మైనార్టీలపై టెర్రరిస్టుల హత్యాకాండపై ఖండించాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పంజాబ్, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్ తో సహా కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి, ఎలాంటి వ్యూహం పాటించాలని ఈ CWC భేటీలో చర్చించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios