వేతనాల విషయంలో గొడవ.. కార్మికుడిని నరికి చంపి, మృతదేహాన్ని పొదల్లో పడేశారు..
వేతనాల విషయంలో గొడవలు కారణంగా తన తండ్రి హత్యకు గురయ్యాడని, హత్య వెనుక కాంట్రాక్టర్ ఉన్నాడని మృతుడి కుమారుడు ఆరోపించాడు.
గురుగ్రామ్: బీహార్‌కు చెందిన 52 ఏళ్ల కార్మికుడిని డబ్బుల విషయంలో వివాదం కారణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లోని పొదల్లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. వేతనాల విషయంలో తన తండ్రికి, కాంట్రాక్టర్ కి గొడవలు ఉన్నాయని.. ఈ హత్య వెనుక కాంట్రాక్టర్ ఉన్నాడని మృతుడి కుమారుడు ఆరోపించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని ర్యాపిడ్ మెట్రో స్టేషన్ సమీపంలోని పొదల్లో రక్తంతో ముద్దయిన ఓ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తలపై, ముఖం మీద పెద్ద వస్తువుతో కొట్టినట్లు గాయాల గుర్తులు ఉన్నాయని వారు తెలిపారు. మృతదేహం సమీపంలో ఒక ఇటుక కూడా పడి ఉంది.
మృతుడిని బీహార్‌కు చెందిన రామ్‌విలాస్‌గా గుర్తించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని సెక్టార్ 56 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో సంజీవ్ కుమార్ తెలిపారు.
దారుణం.. ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి యువకుడి అత్యాచారం..