దారుణం.. ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి యువకుడి అత్యాచారం..
ఓ నాలుగేళ్ల చిన్నారిని యువకుడు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుథియానలో జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తోటి పిల్లలతో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై కామాంధుడు కన్నేశాడు. ఆ పాపను బైక్ పై ఎత్తికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికను వీధిలో విడిచిపెట్టాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జనవరి 13వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం బక్సర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల వికాస్ కుమార్ పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా పట్టణానికి వలస వచ్చి జీవిస్తున్నాడు. పట్టణంలో కూలీగా పని చేస్తున్నాడు. అయితే జనవరి 13వ తేదీన అతడు నివసించే ప్రాంతంలో ఓ వీధి వ్యాపారి కూడా ఉంటున్నారు. ఆయనకు నాలుగేళ్ల కూతురు ఉంది.
ఈ క్రమంలో ఆ చిన్నారి ఎప్పటిలాగే తన వీధిలో ఇతర చిన్నారులతో కలిసి జనవరి 13వ తేదీన ఆడుకుంటోంది. ఈ సమయంలో వికాస్ కుమార్ పిల్లలు ఆడుకుంటున్న ప్రదేశానికి బైక్ పై వచ్చాడు. చిన్నారిని బైక్ పై ఎక్కించుకొని ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లాడు. బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం సమీపంలోని ఓ వీధిలో ఆ చిన్నారిని విడిచిపెట్టాడు. ఇదంతా ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
తనపై జరిగిన దారుణ ఘటనను చిన్నారి తన తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాధితురాలి తండ్రి జనవరి 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బాలిక నివసించే ప్రాంతంలో సీసీటీవీ పుటేజీలు పరిశీలించారు. దీంతో నిందితుడి కదలికలు కనిపించాయి. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా అతడిని ఈస్ట్‌మన్ చౌక్‌లో అరెస్టు చేశారు. అలాగే నేరానికి ఉపయోగించిన టూ వీలర్ ను స్వాధీనం చేసుకున్నామని లూథియానా డీసీపీ (విచారణ) వరిందర్ సింగ్ బ్రార్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లో కూడా వారం రోజుల కిందట ఇలాంటి అత్యాచార ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై రైలు స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో ఓ మైనర్ బాలిక కోపంతో ఇంట్లో నుంచి జనవరి 15వ తేదీన పారిపోయింది. తరువాత ఇటావా స్టేషన్‌కు చేరుకుంది. ఓ బోగిలో వెళ్లి కూర్చుంది. ఈ సమయంలో ఆ బోగిలోకి ఓ స్వీపర్ వచ్చాడు. మైనర్‌ని ఒంటరిగా కూర్చుండటం చూసి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ఆమెపై అత్యారానికి పాల్పడ్డాడు.
మరుసటి రోజు ఉదయం మైనర్ ఎటావా రైల్వే స్టేషన్‌లోని ప్రయాణీకులలో ఒకరి ఫోన్ అడిగి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తనను అక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరింది. తల్లిదండ్రులతో కలిసి ఝాన్సీ ఇంటికి చేరుకుంది. బాలిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక వివరింది. తల్లిదండ్రులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. అనంతరం ఇటావా రైల్వే స్టేషన్‌కు తిరిగి వెళ్లి ఫిర్యాదు చేశారు.