హోదాపై కేవీపీ ప్రైవేట్ బిల్లు.. రేపు మధ్యాహ్నం చర్చించే అవకాశం

First Published 26, Jul 2018, 3:58 PM IST
KVP Ramachandra Rao moves private members bill on special status
Highlights

విభజన చట్టం హమీలు, ప్రత్యేకహోదాపై రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశిపెడుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.

విభజన చట్టం హమీలు, ప్రత్యేకహోదాపై రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశిపెడుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఏపీ విషయంలో బీజేపీ మొదటి నుంచి అబద్ధాలు చెబుతూనే ఉందని.. వందసార్లు ఓ అబద్ధాన్ని చెప్పి... నిజమని నమ్మించాలని ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని..సాధించే వరకు వదిలిపెట్టేది లేదని కేవీపీ స్పష్టం చేశారు. విభజన హామీలపై ప్రధాని నరేంద్రమోడీకి సోనియా లేఖ రాశారని.. అయితే సోనియా లేఖ రాసిన నాటికి 14వ ఫైనాన్స్ కమిషన్ రూపుదిద్దుకోలేదని చెప్పారు.. తర్వాత 19.12.2015న సోనిమా మరో లేఖ రాశారని.. అప్పటికి కూడా 14వ ఆర్థిక సంఘం గురించి ఎవరికీ తెలియదని రామచంద్రరావు అన్నారు.

ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలు సహా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై రేపు రాజ్యసభలో చర్చిస్తామని కేవీపీ స్పష్టం చేశారు.

loader