చెన్నైవాసులు మంచినీరు దొరకక దాహార్తితో అలమటిస్తున్నారు. కాగా.. వారి దాహార్తి తీర్చడానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ముందుకు వచ్చారు. కనీసం కొంతమందికైనా మంచినీరు అందించే ప్రయత్నం ఆయన చేశారు.

తీవ్ర నీటి ఎద్దడితో బాధపడుతున్న చెన్నై వాసులకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. ఆయన అభిమానులతో ఏర్పాటు చేసిన మక్కల్ మండ్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. గతనెలలో కూడా రజినీ అభిమానులు నీటిని పంపిణీ చేశారు. నార్త్ చెన్నైలో సుమారు 2 లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా అందించారు. మంచినీరు అందుకున్న చెన్నై వాసులు రజినీకాంత్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వర్షాలు పడేవరకు చెన్నై వాసులకు ఈ తిప్పలు తప్పేలా లేవు.