అమ్మాయి పక్కనే కూర్చోవాలన్న ఆశ ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీయడంతో పాటు హత్యాయత్నం వరకు వెళ్లింది. కోల్‌కతాలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు బస్సెక్కారు. 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఓ అమ్మాయి పక్కన సీట్లో కూర్చోవాలనుకున్నాడు.. కానీ అప్పటికే ఆమె పక్కన 10వ తరగది విద్యార్థి కూర్చొన్నాడు.. వెంటనే  అతని వద్దకు వెళ్లి.. ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్ అని అక్కడి నుంచి లేచి మరో చోట కూర్చోవాలని బెదిరించాడు..

కానీ ఆ బెదిరింపులకు జూనియర్ విద్యార్థి ఏ మాత్రం లొంగలేదు.. దీంతో సీనియర్ విద్యార్థికి సహనం నశించి గొడవకు దిగాడు.. అది తారాస్థాయికి చేరింది.. ఇద్దరికి నచ్చజెప్పేందుకు పలువురు ప్రయత్నించినప్పటికి ఎవరూ తగ్గలేదు.. గొడవ పెద్దది అవుతుండటంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపాడు.. ఈ సమయంలో సీనియర్ విద్యార్థి రోడ్డు మీదున్న స్టాల్‌లో కత్తిని తీసుకుని జూనియర్‌పై దాడి చేశాడు.. దీంతో విద్యార్థులు, డ్రైవర్ తదితరులు సీనియర్ విద్యార్థిని అడ్డుకున్నారు.. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి.. సీనియర్‌ను పోలీసులకు అప్పగించారు.