Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్ 30న పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్న ప్రధాని న‌రేంద్ర మోడీ

Kolkata: పశ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రూ.7,800 కోట్ల విలువైన  వివిధ పథకాలకు శంకుస్థాపన చేసి, దేశ ప్రజల అంకితం చేయనున్నారు. ఈ క్ర‌మంలోనే కోల్ కత్తాలో జరుగుతున్న జాతీయ గంగా మండలి 2వ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
 

Kolkata : Prime Minister Narendra Modi will visit West Bengal on December 30
Author
First Published Dec 29, 2022, 2:48 PM IST

PM Modi West Bengal visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్ర‌వారం (డిసెంబర్ 30న‌) పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్నారు. ఉదయం 11.15 గంటలకు హౌరా రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడ హౌరా నుంచి న్యూ జల్‌పాయిగురిని కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు. కోల్ కత్తా మెట్రో పర్పుల్ లైన్ లోని జోకా-తారాటాలా విస్తరణను కూడా ఆయన ప్రారంభిస్తారు. వివిధ రైల్వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఐఎన్ ఎస్ నేతాజీ సుభాష్ కు చేరుకుని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ (డీఎస్పీఎం -నివాస్) ను ప్రారంభిస్తారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద ప శ్చిమ బెంగాల్ లో ప శ్చిమ బెంగాల్ లో పలు మురుగు నీటి పారుదల మౌలిక సదుపాయాల పథకాలకు ప్ర‌ధాని శంకుస్థాపన చేసి దేశ ప్రజలకు అంకితం చేస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు జాతీయ గంగానది మండలి రెండో సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహిస్తారు.

దేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని పెంపొందించే మరో చర్యలో భాగంగా శుక్ర‌వారం కోల్ కతాలో జరిగే నేషనల్ గంగా కౌన్సిల్ (ఎన్ జీసీ) రెండో సమావేశానికి ప్రధాన మంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, మండలి సభ్యులుగా ఉన్న ఇతర కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గంగా నది, దాని ఉపనదుల కాలుష్య నివారణ, పునరుజ్జీవనం పర్యవేక్షణకు జాతీయ గంగా మండలికి మొత్తం బాధ్యత అప్పగించారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద రూ.990 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన 7 మురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను (20 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 612 కిలోమీటర్ల నెట్ వర్క్) ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు నబద్వీప్, కచారాప్రా, హాలిషర్, బడ్జ్-బడ్జ్, బారాక్పూర్, చందన్ నగర్, బన్స్బెరియా, ఉత్తరాపర కొట్రంగ్, బైద్యబతి, భద్రేశ్వర్, నైహతి, గరులియా, టిటాఘర్, పానిహతి మునిసిపాలిటీలకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 200 MLD మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని అందిస్తాయి.

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసిజి) కింద రూ.1585 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్న 5 మురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు (8 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 80 కిలోమీటర్ల నెట్వర్క్) ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్ లో 190 MLD కొత్త ఎస్టీపీ సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ ప్రాజెక్టులు ఉత్తర బరాక్ పూర్, హుగ్లీ-చిన్సురా, కోల్ కతా కేఎంసీ ప్రాంతం- గార్డెన్ రీచ్ & ఆది గంగ (టోలీ నాలా), మహేస్తలా పట్టణాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. కోల్ కతాలోని డైమండ్ హార్బర్ రోడ్ లోని జోకాలో సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ (డిఎస్ పిఎమ్ - నివాస్)ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ సంస్థ దేశంలో నీరు, పారిశుధ్యం-పరిశుభ్రత (వాష్) పై దేశంలోనే అత్యున్నత సంస్థగా పనిచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర-స్థానిక ప్రభుత్వాలకు సమాచారం-విజ్ఞాన కేంద్రంగా పనిచేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios