Asianet News TeluguAsianet News Telugu

తండ్రి మృతదేహాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే పెట్టుకుని.. అడిగితే త్వరలోనే కళ్ళు తెరుస్తాడని చెబుతూ...

తన తండ్రి మూడు నెలల కిందటే  చనిపోయాడని, Corpseని ఇంట్లోనే ఉంచానని చెప్పుకొచ్చాడు.  దీంతో ముందు ఆశ్చర్యపోయినా ఆ వ్యక్తి  ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు.  అక్కడికి చేరుకున్న పోలీసులు సంగ్రామ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.  కౌశిక్ ను ప్రశ్నిస్తున్నారు.  కౌశిక్ చెబుతున్న సమాధానాలు పోలీసులకు  కూడా షాక్ ను కలిగిస్తున్నాయి.

Kolkata Man Keeps Father's Dead Body In House For 3 Months
Author
Hyderabad, First Published Nov 24, 2021, 4:32 PM IST

కోల్ కతా : మూడు నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి  జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి నిర్వాకం తాజాగా బయటపడింది. పక్కింటి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని Postmortemకు తరలించారు.  అతను ఎలా చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు? అనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు.  కోల్ కతాలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

కోల్ కతాకు చెందిన సంగ్రామ్ (70)  ఓ రిటైర్డ్ ఉద్యోగి,  తన భార్య కొడుకు కౌశిక్ తో కలిసి  కోల్ కతాలో జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య Paralysis కారణంగా కొద్ది రోజులుగా మంచానికే పరిమితం అయ్యింది. కాగా, మూడు నెలలుగా  సంగ్రామ్ బయట కనిపించడం మానేసాడు. చుట్టుపక్కల వారు sangram గురించి అడిగితే కొడుకు కౌశిక్ వారికి రోజుకో సమాధానం చెప్పేవాడు.

చివరికి ఇటీవల తన పక్కింటి వ్యక్తికి అసలు నిజం చెప్పాడు. తన తండ్రి మూడు నెలల కిందటే  చనిపోయాడని, Corpseని ఇంట్లోనే ఉంచానని చెప్పుకొచ్చాడు.  దీంతో ముందు ఆశ్చర్యపోయినా ఆ వ్యక్తి  ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు.  అక్కడికి చేరుకున్న పోలీసులు సంగ్రామ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.  కౌశిక్ ను ప్రశ్నిస్తున్నారు.  కౌశిక్ చెబుతున్న సమాధానాలు పోలీసులకు  కూడా షాక్ ను కలిగిస్తున్నాయి.

తన తండ్రి చనిపోలేదని త్వరలోనే కళ్ళు తెరుస్తారని కౌశిక్ పోలీసులకు చెప్పాడు దీంతో కౌశిక్ Psychiatric patient అని పోలీసులు భావిస్తున్నారు. తన కొడుకు దగ్గర అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవని అందుకే మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశాడని అతని తల్లి పోలీసులకు చెప్పింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఈ కేసులో ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా Madanapalleలో ఇద్దరు కూతుళ్లను మూఢభక్తితో చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో పెద్ద కూతురు అలేఖ్యను పూజ గదిలో తండ్రి పురుషోత్తంనాయుడు చంపేశాడు. దీంతో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1గా తండ్రి పురుషోత్తం, ఏ2 తల్లి పద్మజగా పోలీసులు చేర్చారు.

ప్రేమించుకుందామంటే మాట వినడం లేదని.. బ్లేడ్ తో యువతి గొంతుకోసి.. దారుణం..

చిన్న కూతురును డంబెల్ తో తల్లి కొట్టి చంపింది. తన చెల్లెలిని  తీసుకొని రావడానికి తనను కూడ చంపాలని పెద్ద కూతురు కోరింది. దీంతో పూజ గదిలో పెద్ద కూతురును తండ్రి కొట్టి చంపాడు. కూతుళ్లను కొట్టి చంపిన తర్వాత తామిద్దరూ కూడ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తన తోటి ఉద్యోగికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకొన్నారు. 

ఆత్మహత్య చేసుకోవాలని భావించిన పురుషోత్తంనాయుడు దంపతులను అడ్డుకొన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు అక్కడికి చేరుకొని కూతుళ్లను చంపిన దంపతులను విచారించారు.  నిన్న సాయంత్రం  కూతుళ్ల Funerals నిర్వహించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జైలుకు తరలించారు. ఆ తరువాత పురుషోత్తం నాయుడు తాము చేసింది తప్పేనని స్పృహలోకి రాగా.. పద్మజ మాత్రం అదే మూఢభక్తిలో ఉండి జైలులోనూ విచిత్రంగా ప్రవర్తించింది. ఆ తరువాత వీరిద్దరూ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి చిత్తూరు జైలులో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios