Asianet News TeluguAsianet News Telugu

సవతి తండ్రి అరాచకం.. బాలికపై మూడేళ్లుగా లైంగిక దాడి.. నాలుగు నెలల్లోనే సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

ఓ మహిళ తనకు, తన బిడ్డకు తోడుగా ఉంటాడని మరో పెళ్లి చేసుకుంది. కానీ ఆ కీచకుడు తన బిడ్డపై క్రూరమైన చర్యకు పాల్పడతాడని ఊహించ లేకపోయింది. అయితే ఈ కేసులో నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి చేసిన కోర్టు.. సంచలన తీర్పు వెలువరించింది.

Kolkata 40 years jail term for a man who sexually assaulting his minor stepdaughter
Author
Kolkata, First Published Dec 2, 2021, 1:44 PM IST

ఓ మహిళ తనకు, తన బిడ్డకు తోడుగా ఉంటాడని మరో పెళ్లి చేసుకుంది. కానీ ఆ కీచకుడు తన బిడ్డపై క్రూరమైన చర్యకు పాల్పడతాడని ఊహించ లేకపోయింది. మూడేళ్లుగా కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసి కుప్పకూలిపోయింది. ఈ ఘటపై పోలీసులను ఆశ్రయించి.. న్యాయం కోసం పోరాడింది. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణను నాలుగు నెలల్లోనే పూర్తి చేసిన సిటీ కోర్టు.. సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సవతి తండ్రికి (Stepdad) 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) కోల్‌కతాలో చోటుచేసుకుంది.

అంతేకాకుండా ఆ కిరాతక సవతి తండ్రికి కోర్టు రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. అది చెల్లించలేని పక్షంలో మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెలువరించింది. మరోవైపు బాధితురాలు పునరావాసం కోసం రూ.3 లక్షలు మంజూరు చేశారు. ఇక, 2018లో కలకత్తా హైకోర్టు.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘనకు గురైనప్పుడు బాధితులకు పరిహారం మంజూరు చేయడానికి అనుకూలంగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

‘ఈ ఏడాది జూన్ 27న ఓ బాలిక బెనియాపు‌కుర్‌ (Beniapukur) పోలీసులకు ఫోన్ చేసింది. అప్పుడు ఆమె బాధలో ఉంది. 2018 నుంచి ఇంట్లోనే తన సవతి తండ్రి పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలిపింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ దాడులు మరింతగా పెరిగిపోయాయని తన బాధను తెలియజేసింది. ఇటీవలే తన తల్లిపై నమ్మకంతో ఆమెకు ఈ విషయం చెప్పానని పేర్కొంది. ఆమె మద్దతుతోనే ఈ ఫోన్ చేశానని మాకు తెలిపింది’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

బాలిక ఫోన్ చేసిన రోజే.. తాము ఆమె సవతి తండ్రిని అరెస్ట్ చేసినట్టుగా ఆ అధికారి చెప్పారు. అతడు బెనియాపు‌కుర్‌‌కు చెందిన వ్యక్తేనని.. డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. అతనిపి పోక్సో చట్టం కింద అభియోగాలు మోపినట్టుగా వెల్లడించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలకు తరలించినట్టుగా తెలిపారు. ఇదిలా బాధిత బాలిక.. స్టేటమ్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ ముందు రికార్డు చేశామని వెల్లడించారు. 

Also read: ఎంబీబీఎస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, ఒకరి అరెస్ట్.. చెల్లి పెళ్లికి పిలిచి దారుణం....

బాలిక తాను అనుభవించిన బాధను ధైర్యంగా వెల్లడించిందని.. తాము కూడా అవసరమైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించినట్టుగా చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు మూడు వారాల్లోనే చార్జిషీట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించినట్టుగా తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత నవంబర్ 26న కోర్టు శిక్ష ఖరారు చేసిందన్నారు. 

మూడు నెలల్లో విచారణ పూర్తి
ఈ ఘటనకు సంబంధించి విచారణను పూర్తి చేసి, సాక్ష్యాలను సమర్పించేందుకు విచారణ అధికారిగా ఉన్న ఎస్‌ఐ అనిమా బిస్వాస్ కేవలం మూడు నెలల సమయం మాత్రమే తీసుకున్నట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమెకు అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ రామకృష్ణ దాస్ సహాయం అందించారని ఒక అదికారి తెలిపారు. అయితే నాలుగు నెలల్లోనే కోర్టు శిక్ష ఖరారు చేయడాన్ని బాలల హక్కుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు స్వాగతించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios