Asianet News TeluguAsianet News Telugu

కోల్‌కత్తాలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం: 15 మందికి గాయాలు

కోల్‌కత్తాలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. సంఘటన స్థలంలో  సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. 

Kolkata: 10 rescued after 5-storey under-construction building collapses on slum lns
Author
First Published Mar 18, 2024, 8:16 AM IST

కోల్‌కత్తా: నగరంలో నిర్మాణంలో ఉన్న  ఐదంతస్తుల భవనం  సోమవారం నాడు తెల్లవారుజామున కుప్పకూలింది.ఈ ఘటనలో  15 మంది గాయపడ్డారు.ఘటన స్థలంలో  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

also read:హృతిక్ రోషన్ పాటకు జంట డ్యాన్స్: సోషల్ మీడియాలో వైరల్

కోల్‌కత్తా నగరంలోని  హజారి మొల్లా భగన్ ప్రాంతంలో  నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది.  ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

also read:పిచ్ మార్చారు: ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపై కైఫ్ ఆరోపణలు

అయితే  ఈ ఘటనలో ఇద్దరు మరణించారని, మరో 15 మంది గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇద్దరు మరణించిన విషయమై అధికారులు ధృవీకరించలేదు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు చెప్పారు.

ఇరుకు సందులో ఐదంస్తుల భవన నిర్మాణానికి కోల్‌కత్తా మున్సిపల్ కార్పోరేషన్ అనుమతించడంపై  స్థానికులు విమర్శలు చేస్తున్నారు. ఈ నిర్మాణం జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు  మూడు అడుగుల కంటే ఎక్కువ మార్గం లేని విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

రెండేళ్ల క్రితమే ఈ నిర్మాణం ప్రారంభించినట్టుగా స్థానికులు చెప్పారు. ఈ విషయమై  టీఎంసీ ప్రభుత్వంపై  బీజేపీ విమర్శలు గుప్పించింది.కోల్‌కత్తా నగరంలోని హాజారి మొల్లా భగన్ లో నిబంధనలకు విరుద్దంగా  ఐదంతస్తుల భవనం కుప్పకూలిన విషయమై విపక్ష నేత సువేంధు అధికారి  స్పందించారు.  ఈ ప్రాంతంలో సహాయక చర్యలను చేపట్టాలని సువేంధు అధికారి  అధికారులను కోరారు. మరో వైపు సోమవారం నాడు తెల్లవారుజామువరకు అధికారులు ఎవరూ కూడ అందుబాటులో లేరని విపక్ష పార్టీ ఆరోపణలు చేస్తుంది. 2011లో టీఎంసీ ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ ప్రాంతాన్ని  గార్డెన్ రీచ్ అని పిలిచేవారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios