పిచ్ మార్చారు: ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపై కైఫ్ ఆరోపణలు
భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు ఓటమిపై మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో పురుషుల ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో అస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.వన్ డే ప్రపంచకప్ పోటీల్లో వరుస విజయాలను నమోదు చేసుకుంటూ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓటమి పాలైంది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధిస్తుందని భావించిన క్రీడాభిమానులకు నిరాశే ఎదురైంది.
also read:టీడీపీ-బీజేపీ- జనసేన పొత్తు,చిలకలూరిపేటలో ప్రజాగళం సభ: మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
ఈ మ్యాచ్ లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. స్లో వికెట్ మధ్య అస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా రాణించారు.కేవలం 240 పరుగులకే భారత జట్టును పరిమితం చేశారు. ట్రావిస్ హెడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం కూడ ఆ జట్టుకు కలిసి వచ్చింది.ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో పిచ్ స్వభావంపై చర్చ జరిగింది. భారతదేశం పరాజయం వెనుక పిచ్ కూడ ప్రధాన కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేని విశ్వసించే వారు కూడ లేకపోలేదు.
ఫైనల్ మ్యాచ్ పిచ్ తయారీ విషయంలో భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర గురించి భారత జట్టు మాజీ సభ్యుడు మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
also read:కూరగాయల తరహలోనే నూడుల్స్ విక్రయం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో
ఈ పిచ్ రంగు మారడం తాను చూసినట్టుగా కైఫ్ పేర్కొన్నాడు.తాను మూడు రోజుల పాటు చాలా షోలు నిర్వహించిన విషయాన్ని కైఫ్ ప్రస్తావించారు. రోహిత్ శర్మ ద్రావిడ్ తో కలిసి పిచ్ వద్ద గంట పాటు నిలబడి వెనుదిరిగిన విషయాన్ని కైఫ్ పేర్కొన్నారు. రెండవ రోజు కూడ వచ్చి అలానే చేశారన్నారు. మూడో రోజు కూడ అలానే చేశారన్నారు.అంతేకాదు పిచ్ రంగు మారిన విషయాన్ని తాను గమనించినట్టుగా కైఫ్ పేర్కొన్నారు. ది లాలన్‌టాప్ గెస్ట్ ఇన్ ది న్యూస్ రూమ్ లో ఈ విషయాన్ని కైఫ్ వెల్లడించారు.
also read:37 కార్పోరేషన్ చైర్ పర్సన్ పదవుల భర్తీ: ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్
పిచ్ పై గడ్డి లేదు, పిచ్ స్లో గా మారిందన్నారు. క్యూరేటర్ తన పని చేశాడు.. తాము ఏమీ చెప్పలేదని చెప్పడం చెత్తగా పేర్కొన్నారు.ప్రపంచకప్ పోటీల్లో చెన్నైలో జరిగిన మ్యాచ్ లో అస్ట్రేలియా కెప్టెన్ పాఠాలు నేర్చుకొన్నాడని కైఫ్ అభిప్రాయపడ్డారు. ఆ గేమ్ లో అస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 199 పరుగులకే అలౌటైంది.భారత జట్టు ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
చెన్నైలో భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. భారత్ జట్టు అస్ట్రేలియా ఇచ్చిన లక్ష్యాన్ని చేధించింది.అయితే సాధారణ పిచ్ అయితే ఫైనల్ మ్యాచ్ లో వంద శాతం ఇండియా విజయం సాధించేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.