ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ భారీగా ఆస్తిపాస్తులను కలిగివున్నారు. ఆమె సంపాదన, ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా?

DID YOU
KNOW
?
కోకిలాబెన్ అస్వస్థత
ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో చేరినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Kokilaben : భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార కుటుంబాల్లో అంబానీలు అగ్రస్థానంలో ఉంటారు. ఈ కుటుంబానికి పెద్దదిక్కు, ముఖేష్, అనీల్ అంబానీల మాతృమూర్తి కోకిలాబెన్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ భార్య…. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీకి తల్లి అయినప్పటికి ఆమె చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతుంటారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన ఆమె భారీ సంపదను కలిగివున్నారు. ఆయితే ఆమె ఆస్తిపాస్తులు మాత్రమే కాదు చీరల సేకరణ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

కోకిలాబెన్ అంబానీ ఆస్తులెంత?

కోకిలాబెన్ అంబానీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.18,000 కోట్లు ఉంటుందని అంచనా. దీనిలో ఎక్కువ భాగం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో వాటాలే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఆమె ప్రత్యక్ష వాటా కుమారుడు ముఖేష్ అంబానీ కంటే ఎక్కువగా ఉంటుందట… ఇదే ఆమెను కంపెనీలో అత్యంత ప్రభావవంతమైన వాటాదారులలో ఒకరిగా చేస్తుంది. ఇంత సంపద ఆమెను భారతదేశంలోని అత్యంత ధనవంతులైన మహిళలలో ఒకరిగా చేస్తుంది. 

కోకిలాబెన్ అంబానీ వద్ద రిలయన్స్ కంపెనీకి చెందిన 1,57,41,322 షేర్లు ఉన్నాయి. అంటే కంపెనీ మొత్తం షేర్లలో 0.24% షేర్లు కోకిలాబెన్ వద్ద ఉన్నాయి. దీనితో పాటు ఇతర ఆస్తులు కూడా ఆమెకు ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్‌తో సహా కోకిలబెన్ పేరిట రు.18 వేల కోట్లపైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

కోకిలా బేన్ ఆదాయం, పారితోషికాలు

వ్యాపారాలను చురుగ్గా నిర్వహించే యువ అంబానీల మాదిరిగా కాకుండా కోకిలబెన్ ఆదాయం ఎక్కువగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వాటాలు, డివిడెండ్‌లు, ప్రత్యక్ష పెట్టుబడుల నుండి వస్తుంది. ఆమె రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనరు… కానీ వివిధ మార్గాల్లో ఆదాయం వస్తుంటుంది. బోర్డ్‌రూమ్ లో కూర్చోకపోయిన ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్ ను శాసించేస్థాయిలో ఉన్నారు. 

కోకిలాబెన్ చీరల కలెక్షన్స్

కోకిలబెన్ అంబానీ ఎల్లప్పుడూ సాంప్రదాయబద్దమైన చీరకట్టులోనే కనిపిస్తారు…. ఇది ఆమె జీవనశైలిలో భాగంగా మారింది. మంచి చీర కనిపిస్తే చాలు దాన్ని కొనేస్తుంటారు.. ఇలా చీరల సేకరణ హాబీ కలిగివున్నారు కోకిలాబేన్.

పటోలా చీరలు: కోకిలాబేన్ వద్దగల అత్యంత ప్రసిద్ధ కలెక్షన్స్ లో ఒకటి ఈ పటోలా డబుల్-ఇకత్ చీర… ఇది గుజరాత్ శైలిలో చేతితో నేసిన అద్భుతమైన చీర. అలాంటి చీరలు సాధారణంగా ₹1.5 లక్షల ధర పలుకుతాయి. దీన్నిబట్టి డిజైనర్ దుస్తుల కంటే వారసత్వ వస్త్రాలకే కోకిలాబేన్ ప్రాధాన్యత చూపుతారని అర్థమవుతుంది. 

సిల్క్ చీరలు: ఆమె సిల్క్ చీరలు ఎక్కువగా పసుపు, గులాబీ రంగుల్లో… మృదువైన వేరియంట్స్ లో ఉంటాయి. ఆమె అందంగా కనిపించేందుకు కాకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. మంచి నాణ్యమైన చేతితో నేసిన సిల్క్ చీర నేతను బట్టి ₹50,000 నుండి ₹2 లక్షల వరకు ఉంటుంది.

ఇక కుటుంబ కార్యక్రమాల కోసం కోకిలబెన్ సూక్ష్మ ఎంబ్రాయిడరీ లేదా నేసిన జరీ చీరలను ధరిస్తారు. ఈ దుస్తులకు తేలికపాటి వజ్రం లేదా ముత్యాల నగలను జత చేస్తారు.

కోకిలాబేన్ సింపుల్ లైఫ్ స్టైల్

సంపద ఉందికాబట్టి విలాసవంతంగా బ్రతకాలని కోకిలాబేన్ అనుకోరు… చాలా సింపుల్, సంప్రదాయ జీవితాన్ని గడుపుతున్నారు. హై-ప్రొఫైల్ ఈవెంట్‌లలో కూడా ఆమె దుస్తుల శైలి విలాసవంతంగా కాకుండా చాలా సింపుల్ గా ఉంటాయి. ఆమె ఫ్యాషన్ వెర్రిని అనుసరించరు… కానీ భారతీయ కళా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు.