Asianet News TeluguAsianet News Telugu

కేఎన్ త్రిపాఠి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ.. ఇక కాంగ్రెస్ చీఫ్ బ‌రిలో శ‌శిథ‌రూర్, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే లు మాత్రమే.

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో కేవలం ఇద్దరు నేతలే మిగిలారు. జార్ఖండ్ కు చెందిన కేఎన్‌ త్రిపాఠి దాఖలు చేసిన నామినేషన్ సెట్ రిజెక్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రధానంగా మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీలో నిలిచారు. 

KN Tripathi's nomination was rejected. Shashitharur and Mallikarjun Kharge are the only Congress chiefs.
Author
First Published Oct 1, 2022, 4:20 PM IST

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు జార్ఖండ్‌ మాజీ మంత్రి కెఎన్‌ త్రిపాఠి దాఖలు చేసిన నామినేషన్‌ శనివారం తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యింది. దీంతో ప్ర‌స్తుతం కేవలం ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఎంపీ శశిథరూర్‌ మధ్య పోటీ ఉండ‌నుంది. 

ఈ ముగ్గురు నేత‌లు చివ‌రి రోజైన శుక్ర‌వారం త‌మ నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.  కాగా.. శ‌నివారం న్యూ ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ మాట్లాడుతూ.. నామినేషన్‌ ప్రక్రియలో మొత్తం 20 నామినేష‌న్ సెట్లు వచ్చాయని, వాటిలో నాలుగు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు.

తప్పులన్నీ మీవే... ఇంతగా దిగజారాలా : సిద్ధరామయ్యపై బసవరాజ్ బొమ్మై తీవ్ర వ్యాఖ్యలు

ఖర్గే 14 సెట్లు సమర్పించార‌ని, థ‌రూర్ ఐదు, త్రిపాఠి ఒక‌టి స‌మ‌ర్పించార‌ని చెప్పారు. త్రిపాఠి ప్రతిపాదకులలో ఒకరి సంతకం సరిపోలకపోవడంతో ఆయ‌న నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యింద‌ని పేర్కొన్నారు. మరో ప్రపోజర్ సంతకం రిపీట్ అయ్యింద‌ని మిస్త్రీ చెప్పారు.

కాగా.. ప్ర‌స్తుతం తిర‌స్క‌ర‌ణ‌కు గురైన కేఎన్ త్రిపాఠి పూర్తి పేరు కృష్ణానంద్ త్రిపాఠి. ఆయ‌న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. త్రిపాఠి రాజకీయాల్లోకి రాకముందు ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు. ఆర్మీ ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో కాంగ్రెస్ టిక్కెట్ పై ద‌ల్తోన్ గంజ్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. 2009లో మళ్లీ దాల్తోగంజ్ స్థానం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. తర్వాత ఆ  రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీక‌రించారు. అయితే 2014లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

బుల్లితెర రాముడు అరుణ్ గోవిల్ కాళ్లు మొక్కిన మహిళ.. వీడియో వైరల్

అయితే ఇటీవ‌ల వ‌ర‌కు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఉంటార‌ని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయ‌న పోటీలో ఉండ‌టం వ‌లేద‌ని భావించారు. వాస్త‌వానికి కాంగ్రెస్ చీఫ్ గా అశోక్ గెహ్లాట్ స‌రైన వ్య‌క్తి అని అధిష్టానం భావించింది. కానీ పోటీ చేసే ముందు ఆయన సీఎం పదవి వదులుకోవాలని హైక‌మాండ్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, త‌దుప‌రి సీఎం ఎవరనేది కూడా తామే నిర్ణయిస్తామ‌ని పేర్కొంది. కానీ సీఎం పదవి వెంటబెట్టుకునే అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేద్దామని గెహ్లట్ అనుకున్నారు. అయితే ఒకరికి ఒక పదవి అనే నిబంధనను కాంగ్రెస్ పాటిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ప‌ని చేస్తుంది - సీఎం అశోక్ గెహ్లాట్

రాహుల్ ప్రకటన తర్వాత‌ రాజస్తాన్‌లో ఎమ్మెల్యేల తిరుగుబాటు మొద‌లైన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. సచిన్ పైలట్‌ను సీఎంగా చేయకూడ‌ద‌ని, గెహ్లాట్‌తో సూచించిన వారినే సీఎంను ఎన్నుకోవలని అల్టిమేటం పెట్టారు. ఇది అధిష్టానాన్ని తీవ్రంగా అసంతృప్తి పరిచింది. ఇలా రాష్ట్రంలో వెంట వెంట‌నే రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోవ‌డంతో అశోక్ గెహ్లాట్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. సోనియా గాంధీతో చ‌ర్చించి అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ నుంచి త‌ప్పుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios