Asianet News TeluguAsianet News Telugu

బుల్లితెర రాముడు అరుణ్ గోవిల్ కాళ్లు మొక్కిన మహిళ.. వీడియో వైరల్

1990ల కాలంలో రామానంద్ సాగర్ దర్శకత్వం వహించి నిర్మించిన సీరియల్ సెన్సేషనల్ హిట్ అయింది. దేశవ్యాప్తంగా చాలా మందిపై ఈ సీరియల్ ప్రభావం ఉన్నది. ఎంతటి ప్రభావం అంటే.. ఆ సీరియల్‌లోని పాత్రధారులు బయట కనిపించినా అదే దేవుడిగా వారిని మొక్కేవారు. కానీ, ఈ సీరియల్ విడుదలై 35 ఏళ్లు గడిచినప్పటికీ ఆ సీరియల్ ప్రభావం ఇంకా చెక్కుచెదరలేదు. తాజాగా, ఓ మహిళ రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ కాళ్లపై పడి మొక్కిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
 

A woman touches feet of lord ram reel life arun govil in a viral video
Author
First Published Oct 1, 2022, 4:03 PM IST

న్యూఢిల్లీ: 1990ల కాలంలో రామానంద్ సాగర్ రామాయణ్ సీరియల్‌ను దర్శకత్వం వహించారు. నిర్మించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ సీరియల్ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ సీరియల్ పెద్ద హిట్. ఈ సీరియల్‌లో నటించిన నటులకు పెద్ద ఫ్యాన్స్ ఉండేవారు. వారిని అభిమాన తారలుగా కాకుండా నిజంగా వారు ధరించిన పాత్రలుగానే చూసేవారు. వారు కనిపిస్తే.. దేవుడిని మొక్కినట్టుగానే మొక్కేవారు.

ఈ సీరియల్ దాదాపు 35 ఏళ్ల కింద విడుదలైంది. కానీ, ఆ సీరియల్ ప్రభావం మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆ సీరియల్ పాత్రదారులను గుర్తించడమే కాదు.. ఇప్పటికీ ఆదరణగానే కొలుస్తున్నారు. తాజాగా, ఈ సీరియ్‌లో రాముడి పాత్ర వేసిన అరుణ్ గోవిల్ ఓ ఎయిర్‌పోర్టులో దిగారు. అరుణ్ గోవిల్‌ను చూడగానే ఓ మహిళ వెంటనే ఆయన వద్దకు చేరుకుంది. నిజంగా దేవుడే దిగి వచ్చాడా? అన్నట్టుగా తబ్బుబ్బయిపోయింది. మోకరించి పాదాభివందనాలు చేసింది. కానీ, అరుణ్ గోవిల్ మాత్రం అలా తన కాళ్లు మొక్కడంపై కొంత అసహనంగానే కనిపించాడు. అయినప్పటికీ ఆమెను లేపి మర్యాదగా మాట్లాడాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొన్ని లక్షల మంది వీక్షించారు. పదుల వేలల్లో లైకులు వచ్చాయి. 

టీవీ సీరియల్ రామాయణ్‌ను రామానంద్ సాగర్ రచించి, దర్శకత్వం వహించారు. ఆయనే ఈ సీరియల్‌ను ప్రొడ్యూస్ చేశారు. 1987లో తొలిసారి దూరదర్శన్‌లో ప్రసారమైంది. ఏళ్ల తరబడి ఒక కల్ట్ స్టేటస్‌గా వెలుగొందింది.

కరోనా కారణంగా 2020లో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినప్పుడూ 33 ఏళ్ల తర్వాత మరోసారి ఈ సీరియల్‌ను ప్రసారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్‌ను 7.7 కోట్ల మంది వీక్షించారని డీడీ నేషనల్ 2020 ఏప్రిల్ 16న వెల్లడించింది. కరోనా లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ఈ సీరియల్‌ను ప్రసారం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios