Kirit Somaiya Vs Shinde Camp: మాజీ సీఎం ఉద్ధవ్‌పై బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య చేసిన ట్వీట్‌పై షిండే క్యాంప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము శివసేన నుండి విడిపోయి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ శివసేనలోనే ఉన్నామని సంజయ్ గైక్వాడ్ అన్నారు 


Kirit Somaiya Vs Shinde Camp: బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య చేసిన ట్వీట్ షిండే వ‌ర్గం ఎమ్మెల్యేల‌కు కోపం తెప్పించింది. కిరీట్ సోమయ్య ఓ ట్వీట్ లో ఉద్ధవ్ థాకరేను విమ‌ర్శిస్తూ.. మాఫియా సీఎం అని విమ‌ర్శించారు. ఈ ట్వీట్ పై ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పారు. షిండే వ‌ర్గానికి చెందిన‌ శివసేన ఎమ్మెల్యేలు సంజయ్ గైక్వాడ్, అబ్దుల్ సత్తార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రేతో లేకపోయినా, ప్రస్తుతం పార్టీ మాది అని సంజయ్ గైక్వాడ్ చెప్పారు. 

శివసేన నుంచి విడిపోయి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నా.. ఇప్పటికీ శివసేనలోనే ఉన్నామని కిరీట్ సోమయ్యకు చెప్పాలనుకుంటున్నామని సంజయ్ గైక్వాడ్ అన్నారు. బాలాసాహెబ్ థాకరే, ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేల పట్ల మనకున్న గౌరవం తగ్గిపోయిందని ఇప్పుడే అనుకోవద్దు. భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కానీ, మనం ఏ పార్టీ నుంచి వచ్చి ఎదిగిన పార్టీ గురించి తప్పుగా వినలేం. ఈ విషయంలో వారికి మా వినయపూర్వకమైన విన్నపం. మాకు అధికారంతో అనుబంధం లేదు, ఇవన్నీ సహించలేము.

కిరీట్ సోమయ్య వ్యాఖ్య‌లపై శివసేన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కిరీట్ సోమ‌య్య 
సాహబ్ చెప్పింది తప్పని అన్నారు. పార్టీలోకి వచ్చిన వ్యక్తి గురించి లేదా వెళ్ళే వ్యక్తి గురించి ఎవరూ అలాంటి మాటలు మాట్లాడకూడదు. మహారాష్ట్రలో మాట్లాడే, జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కిరీట్ సోమయ్య మాట్లాడుతున్న దాని గురించి నేను మాట్లాడటం తగదు.

ఇంత‌కు ముందు బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య, తన కుమారుడు నీల్ సోమ‌య్య‌తో నూత‌నంగా మహారాష్ట్ర సిఎంగా ప్రమాణం చేసిన ఏక్‌నాథ్ షిండేను క‌లిశారు. ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌ అభినంద‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించారు. ఈ భేటీ అనంత‌రం.. కిరీట్ సోమయ్య, తన కుమారుడు నీల్ సోమయ్యతో సీఎం షిండేల‌తో దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాతో పోస్టు చేశారు. ఉద్ద‌వ్ ను విమ‌ర్శిస్తూ.. మాఫియా సిఎం అని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

సమావేశానికి సంబంధించిన ఫోటోల‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. బీజేపీ నాయకుడు ఇలా రాశారు, “ఈరోజు మంత్రాలయలో 'రిక్షవాలా' సీఎం ఏక్‌నాథ్ షిండేను నీల్ సోమయ్యతో కలిసి కలిశాను. మాఫియా సీఎంను భర్తీ చేసినందుకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలిపారు.

ఐఎన్‌ఎస్ విక్రాంత్ పునరుద్ధరణ కోసం.. సేకరించిన నిధులను స్వాహా చేశారన్న అవినీతి కేసుకు సంబంధించి కిరీట్ సోమయ్య , అతని కుమారుడు నీల్‌కు బొంబాయి హైకోర్టు గురువారం నాడు అరెస్టు నుండి మధ్యంతర రక్షణను ఆగస్టు 10 వరకు పొడిగించింది.