Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్..

ఢిల్లీలో కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నాలుగు రోజుల తరువాత నిందితుడిని పట్టుకున్నారు. 

Kidnapping Raping Of 4-Year-Old Girl in Delh, Accussed Arrested
Author
First Published Dec 27, 2022, 11:08 AM IST

న్యూఢిల్లీ : గతవారం ఢిల్లీలో కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం ఘటనలో నిందితుడిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. అత్యాచారం తరువాత చిన్నారిని సమీపంలోని పార్కు ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడు. కిడ్నాప్ కు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదవ్వడంతో పోలీసులు నిందితుడికోసం గాలించారు. నిందితుడిని ఢిల్లీకి చెందిన అనిల్ పాఠక్ అనే వ్యక్తిగా గుర్తించారు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం.

ఔటర్-నార్త్ ఢిల్లీలోని భల్స్వా డెయిరీ ప్రాంతంలో గత బుధవారం ఈ ఘటన జరిగింది. రోజువారీ కూలీ పనిచేసుకునే దంపతుల కుమార్తెను అనిల్ పాఠక్ ఆమె ఇంటిముందు ఆడుకుంటుండగా కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో నిందితుడు బాలికను తన చేతుల్లోకి తీసుకెళ్లడం కనిపించింది.

ఢిల్లీలో 5 ఏళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం.. సీసీటీవీలో నమోదైన దృశ్యాలు..

రాత్రి అయినా చిన్నారి ఇంటికి రాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఆమె దగ్గర్లోని ఒక పార్కు సమీపంలో కనుగొనబడింది. అధికారులు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారని అధికారులు తెలిపారు. కిడ్నాప్ కేసు నమోదవ్వడంతో చిన్నారిని కనిపెట్టేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఆమె ఫోటోను ఇతర పోలీస్ స్టేషన్‌లకు కూడా పంపించారు. ఆమె గురించి ఆ పరిసర ప్రాంతంలో పోస్టర్లు కూడా వేశారు. 

రాత్రంతా చిన్నారి గురించి అన్వేషించారు. గురువారం ఉదయం 7 గంటలకు పార్క్ సమీపంలో చిన్నారి కనిపించిందని ఔటర్-నార్త్ ఢిల్లీలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు.మైనర్ బాలికపై అత్యాచారం, అపహరణకు పాల్పడిన నిందితులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) కూడా ఈ కేసులో పోలీసుల నుండి నివేదిక కోరింది.

"ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆమెను భల్స్వా డెయిరీలోని ఆమె నివాసం ముందు నుండి ఎత్తుకెళ్లారు. తరువాత, ఒక సరస్సు సమీపంలో కనుగొనబడింది. ఆమెకు ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. మా సభ్యులు ఆమెతో ఉన్నారు. నిందితులను త్వరలో అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశాం' అని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ హిందీలో ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios