హర్యానాలో దారుణం జరిగింది. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు భివానీ జిల్లాలో హత్యకు గురయ్యారు. బాధితులిద్దరనీ దుండగులు కిడ్నాప్ చేసి, వాహనంలో ఘటనా స్థలానికి తీసుకొని వచ్చి నిప్పంటించారు. 

హర్యానాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ కు గురయ్యారు. తరువాత వారి మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభించాయి. భివానీ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. మృతులను రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని పహారీ తహసీల్‌కు చెందిన ఘట్మీకా గ్రామానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

డీఎంకే నాయకుడు మొదట కత్తితో మా నాన్న మీద దాడి చేశాడు.. సైనికుడి మృతి ఘటనపై సోదరుడు..

బాధితులిద్దరూ బుధవారం కిడ్నాప్‌కు గురయ్యారని లోహారు (భివానీ) డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ జగత్ సింగ్ ‘ఎన్డీటీవీ’తో ఫోన్ లో తెలిపారు. వీరిద్దరూ రాజస్థాన్‌కు చెందిన వారనీ, వారి మృతదేహాలు ఓ వాహనంలో కాలిపోయిన స్థితిలో లభ్యమైనట్టు పేర్కొన్నారు. లోహారు ప్రాంతంలో ఓ వాహనం దగ్ధమైందని ఓ గ్రామస్థుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దారుణం.. ఉన్నావ్‌లో బర్త్‌డే పార్టీకి పిలిచి.. డ్యాన్సర్ పై సామూహిక అత్యాచారం..

భరత్‌పూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని లోహారు వరకు వాహనం నడిపి, ఆపై నిప్పంటించి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురి వ్యక్తులపై గోపాల్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు భరత్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ శ్యామ్ సింగ్ తెలిపారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత నమోదు..

మృతదేహాలు లభించిన వాహనం మృతులకు తెలిసిన వ్యక్తిదని పోలీసులు చెప్పారు. వాహనం ఛాసిస్‌ నంబర్‌ను బట్టి వాహనం యజమాని అసీన్‌ఖాన్‌గా గుర్తించారు. బాధితులను కిడ్నాపర్లు ఘటనా స్థలానికి తీసుకువచ్చి, ఆపై అర్ధరాత్రి తర్వాత నిప్పంటించారని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులను పిలిపించి వాహనాన్ని గుర్తించామని, న్యాయపరమైన లాంఛనాల అనంతరం మృతదేహాలను వారికి అప్పగించామని వారు చెప్పారు. భారతీయ శిక్షాస్మృతిలోని 365తో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.