కౌన్సిలర్ చిన్నస్వామి మా నాన్నపై కత్తితో విరుచుకుపడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ దెబ్బ అతని తలపై పడింది, అదే మెడపై పడి ఉంటే, అతను బతికేవాడు కాదు అని దాడిలో గాయపడిన ప్రభాకర్  చెప్పాడు. 

బెంగళూరు : తమిళనాడులో ఒక సైనికుడిపై మూకుమ్మడి దాడి చేసి చంపిన కేసులో ఆ సమయంలో డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి కత్తి పట్టుకుని నిల్చున్నాడని మృతుడి సోదరుడు చెప్పాడు. అంతేకాదు, కౌన్సిలర్ చిన్నస్వామి మా నాన్నపై కత్తితో దాడి చేశాడు. అదృష్టవశాత్తూ ఆ దెబ్బ మా నాన్న తలపై పడింది, అదే అతని మెడ మీద పడిఉంటే, అతను అక్కడికక్కడే మరణించేవాడు... అని ఫిబ్రవరి 8న దాడిలో గాయపడిన ప్రభాకర్ అన్నారు.

దాడి జరిగినప్పటి నుంచి కృష్ణగిరి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న వ్యక్తిని తన సోదరుడి అంత్యక్రియల కోసం డిశ్చార్జ్ చేశారు. దాడిలో గాయపడిన 29 ఏళ్ల ఎం. ప్రభు ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేసి మంగళవారం మరణించాడు. స్థానిక సింటెక్స్ ట్యాంక్‌లోని నీటితో బట్టలు ఉతకడం విషయంలో కౌన్సిలర్‌తో గొడవ ప్రారంభమైందని ప్రభాకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. "చిన్నస్వామి మేనల్లుడు కూడా అక్కడ బట్టలు ఉతుకుతున్నాడు, మేము అక్కడికి వెళ్లేసరికి మమ్మల్ని అక్కడినుంచి వెళ్లిపొమ్మని బెదిరించారు. అందరూ అక్కడ బట్టలు ఉతుకుతున్నారు. మేము ఎందుకు వెళ్ళాలి అన్నాం" అని చెప్పుకొచ్చాడు. 

తమిళనాడులో దారుణం : సైనికుడిని కొట్టి చంపిన గూండాలు.. నిందితుడు డీఎంకే నేత, ఖండించిన రాజీవ్ చంద్రశేఖర్

దీంతో వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుని ఆ వ్యక్తి ప్రభాకర్‌, అతని సోదరుడు, తల్లిని చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించడంతో స్థానికులు జోక్యం చేసుకుని అందరినీ శాంతింపజేశారు. అయితే సాయంత్రం చిన్నస్వామి, అతని బంధువులు, అనుచరులు ప్రభాకర్ ఇంటి మీదికి వచ్చారు. ఆ తరువాత మా నాన్నను దుర్భాషలాడారు, చిన్నస్వామి కత్తితో తండ్రిమీద దాడి చేశారని ప్రభాకర్‌ తెలిపారు. ఆ దెబ్బ అతని నుదిటిపై పడిందని, దీంతో తండ్రి నొప్పితో కేకలు వేయడంతో ప్రభాకర్ ఇంట్లో నుండి బయటకు వచ్చాడు.

ప్రభాకర్ ను చూడగానే వెంటనే ఆరుగురు లేదా ఏడుగురు వ్యక్తులు అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. ఆ తరువాత అతన్ని పక్కకు లాగారు. "ఈ సమయంలో నా తమ్ముడు లోపలే ఉన్నాడు. నేనుదెబ్బల నొప్పితో కేకలు వేయడం ప్రారంభించడంతో, అతను బయటకు వచ్చాడు. అతడిని చూడగానే అతని మెడమీద గట్టిగా ఒక్క దెబ్బ వేశారు. దీంతో అతను అక్కడికక్కడే పడిపోయాడు’’ అని ప్రభాకర్ చెప్పాడు.

ఆ విషయంలో సిగ్గుతో తల దించుకున్నా.. : ఆర్మీ సైనికుడి హత్యపై స్పందించిన బీజేపీ నేత

ఈ దాడిలో చిన్నస్వామి సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. రాష్ట్ర అధికార డీఎంకే నుంచి ఎలాంటి స్పందన కానీ, చర్యలు కానీ లేవు. దాడికి పాల్పడిన వారందరికీ మరణశిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుకు భార్య పునీత, ఇద్దరు చంటిపిల్లలు ఉన్నారని.. వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని.. ముఖ్యమంత్రిని కలవాలని డిమాండ్ చేశారు.