141 మంది ఎంపీల సస్పెన్షన్ పై ఖర్గే ఫైర్.. బీజేపీ ఒకే పార్టీ పాలన ఉండాలని చూస్తోందంటూ వ్యాఖ్యలు..
లోక్ సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన (Lok Sabha security breach)పై ఆందోళన నిర్వహిస్తున్న ఎంపీలపై సస్పెషన్ వేటు (suspension of MPs) వేయడం పట్ల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (congress national president mallikarjun kharge) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టి, ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అవుతుందని అన్నారు.
పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. కేంద్రంలోని అధికార బీజేపీపై మండిపడ్డారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకే పార్టీ పాలన ఉండాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే ఎంపీలపై సస్పెషన్ వేటు వేశారని ఆరోపించారు.
నేటి నుంచి శాసనసభ సమావేశాలు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రభుత్వం రెడీ.. ఎందుకంటే ?
పార్లమెంటులో తీవ్రమైన భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోం మంత్రి నుంచి స్పందన కోరినందుకే 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఖర్గే అన్నారు. కానీ చొరబాటుదారుల ప్రవేశానికి సహకరించిన బీజేపీ ఎంపీ మాత్రం నిర్దోషిగా ఉన్నారని తెలిపారు. ఆయనను ఇంకా ప్రశ్నించలేదని చెప్పారు. ‘ఇది ఎలాంటి దర్యాప్తు’ అని మల్లికార్జున్ ఖర్గే తన ‘ఎక్స్’ హ్యాండిల్ ద్వారా ప్రశ్నించారు.
కేసీఆర్ పేరును తొలగించి తన పేరు ... అధికారులపై సీఎం రేవంత్ సీరియస్
పార్లమెంటరీ భద్రతకు బాధ్యులైన సీనియర్ అధికారులను ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ పాటికి వారిని తప్పించాల్సిందని తెలిపారు. కొన్ని నెలలుగా ఈ దాడికి పాల్పడేందుకు చొరబాటుదారులు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. ఈ భారీ ఇంటెలిజెన్స్ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. పార్లమెంటుకు బహుళ అంచెల భద్రత ఉన్నప్పటికీ, ఇద్దరు చొరబాటుదారులు తమ బూట్లలో పసుపు గ్యాస్ డబ్బాలను దాచి భవనంలోకి ప్రవేశించి భారత ప్రజాస్వామ్య గర్భగుడిలోకి ఎలా చేరుకోగలిగారని అన్నారు.
ప్రధాని, ఆయన పార్టీ దేశంలో ఒకే పార్టీ పాలనను నెలకొల్పాలని కోరుకుంటున్నారని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు,. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని అన్నారు. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా వారు చేసింది ఇదే అని మండిపడ్డారు. ఈ భద్రతా లోపానికి కారణమైన, ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని శిక్షించడానికి బదులుగా, ఎంపీల ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల జవాబుదారీతనం నుండి తప్పించుకుంటున్నారని ఆరోపించారు.