India-Canada Row: 'హమాస్ తరహాలో భారత్‌లో దాడి చేస్తాం..' : ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు..
India-Canada Row: ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కొత్త వీడియో ఆన్‌లైన్‌లో బయటపడింది. ఇందులో భారతదేశం పంజాబ్‌ను ఆక్రమించడాన్ని కొనసాగిస్తే.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తరహాలో ప్రతిస్పందన చూడాల్సి వస్తుందనీ, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుండి నేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని బెదిరించాడు.
India-Canada Row: భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచి ఖలిస్తానీ వేర్పాటువాదుల ఆగడాలు తీవ్రమయ్యాయి. వారి దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రధానంగా నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ అరాచకాలు అన్ని ఇన్ని కావు. భారత్ లోనే ఉగ్రవాదులు చేస్తామని ప్రధాని మోదీ సహా భారత అధికారుల్నీ బెదిరిస్తోంది. వరల్డ్ కప్‌ను వరల్డ్ టెర్రర్ కప్‌గా మారుస్తామని గతంలో బెదిరింపులకు పాల్పడింది.
తాజాగా.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన విధంగానే భారత్‌పై కూడా దాడి చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది, జస్టిస్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌ను హెచ్చరించారు. ఖలిస్తానీ ఉగ్రవాది కొత్త వీడియోను విడుదల చేసి భారత ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని హెచ్చరించాడు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడి నుండి గుణపాఠం నేర్చుకోవాలని ఈ ఉగ్రవాది సలహా ఇచ్చారు. ఖలిస్థానీ ఉగ్రవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
భారతదేశంపై విషం చిమ్మిన 40 సెకన్ల ఈ వీడియోలో గురుపత్వంత్ సింగ్ పన్ను పంజాబ్‌ను భారతదేశంలో ఒక భాగంగా పరిగణించడం లేదని, దానిని విముక్తి చేయాలని డిమాండ్ చేశాడు. 'ఇజ్రాయెల్‌పై నేడు పాలస్తీనా దాడి చేస్తోంది. ఈ దాడి నుంచి ప్రధాని మోదీ పాఠాలు నేర్చుకోవాలి. ఇజ్రాయెల్ తరహాలో భారత్ పంజాబ్‌పై కూడా పట్టు సాధిస్తాం. భారత ప్రభుత్వం తమపై హింసను ప్రారంభిస్తే.. తాము కూడా హింసను ప్రారంభిస్తాం " అని వీడియోలో పేర్కొన్నారు.
పన్ను ఇంకా మాట్లాడుతూ, "పంజాబ్‌పై భారతదేశం తన ఆక్రమణను కొనసాగిస్తే.. ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. దీనికి ప్రధాని మోడీ, భారత ప్రభుత్వం బాధ్యత వహించాలి. న్యాయం కోసం సిక్కులు ఓటు వేయడాన్ని నమ్ముతారు. ఓటును నమ్మండి. పంజాబ్ విడిపోయే రోజు దగ్గర పడింది. మీకు ఓటింగ్ కావాలా, బుల్లెట్లు కావాలా?" అని ప్రశ్నించారు.
ఇంకా.. పంజాబ్‌లో నివసించే ప్రజలు పాలస్తీనా లాగా హింసను ప్రారంభిస్తే.. పరిస్థితి విధ్వంసకరంగా మారుతుందని టెర్రరిస్ట్ పన్ను హెచ్చరించారు. భారతదేశం పంజాబ్‌ను విముక్తి చేయాలనీ, భారతదేశం అలా చేయకపోతే ఇజ్రాయెల్ లాంటి భయంకరమైన దృశ్యాన్ని చూడాల్సి వస్తుందని ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్ను వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.