Asianet News TeluguAsianet News Telugu

ఆదిత్య ఎల్ -1లో కీలక విన్యాసం.. భూమికి టాటా చెప్పి.. సూర్యుడి కక్ష్య దిశలో ప్రయాణం..

ఆదిత్య ఎల్ -1 మరో సారి తన కక్ష్యను పెంచుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆ మిషన్ తో ఐదో సారి విన్యాసం జరిపించారు. దీంతో ఆ ఉపగ్రహం పెరగడంతో పాటు కక్ష్య ప్రయాణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భూ కక్ష్యకు వీడ్కోలు పలికి, ఎల్ -1 కక్ష్య దిశలో ప్రయాణం మొదలుపెట్టింది.

Key maneuver in Aditya L-1.. Tata told Earth.. Travel in the direction of Sun's orbit..ISR
Author
First Published Sep 19, 2023, 7:32 AM IST

సూర్యుడి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపించిన ఆదిత్య ఎల్ -1 విజయవంతంగా తన ప్రయాణం కొనసాగిస్తోంది. తాజాగా ఈ మిషన్ కీలక విన్యాసాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఆ విన్యాసం పూర్తయిన తరువాత ఆదిత్య ఎల్ -1 భూ కక్ష్య ను వదిలిపెట్టింది. సూర్యుడి ఎల్ -1 కక్ష్య దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా తన ఎక్స్ (ట్విట్టర్) పేజీలో పోస్టు చేసింది. 

‘‘ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (TL1I) విన్యాసం విజయవంతంగా పూర్తయ్యింది. దీంతో ఈ వ్యోమనౌక ఇప్పుడు సూర్యుడు-భూమి ఎల్ 1 బిందువు వద్దకు ప్రయాణం మొదలుపెట్టింది. సుమారు 110 రోజుల తర్వాత దీనిని విన్యాసం ద్వారా ఎల్ 1 చుట్టూ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ’’ అని పేర్కొంది. సన్ మిషన్ ఐదో సారి విన్యాసం జరిపి, తన కక్ష్యను పెంచుకోవడం ద్వారా ఈ చర్య సాధ్యమైంది. 

ఇస్రో ఆదిత్య ఎల్ -1 మిషన్ భూ కక్ష్యను ఇస్రో ఇప్పటి వరకు నాలుగు సార్లు పెంచింది. తాజాగా ఐదో సారి పెంచి దానిని ఎల్ -1 వైపు ప్రయాణం మొదలుపెట్టేలా చేసింది. గతంలో ఆదిత్య-ఎల్ 1 భూమి చుట్టూ తన ప్రయాణంలో వరుసగా సెప్టెంబర్ 3, 5, 10, 15 తేదీలలో నాలుగు సార్లు విన్యాసాలకు గురైంది. తాజా విన్యాసంతో తన వేగాన్ని మరింత పెంచింది. కాగా.. సుమారు 127 రోజుల తర్వాత ఆదిత్య-ఎల్ 1 ఎల్ 1 పాయింట్ వద్ద నిర్దేశిత కక్ష్యకు చేరుకుంటుందని ఇస్రో తెలిపింది.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ57) విజయవంతంగా ప్రయోగించింది. భూమికి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మొదటి సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్ 1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుండి సూర్యుడిని అధ్యయనం చేసే మొదటి భారతీయ అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ మిషన్ ఇది. ఈ ఆదిత్య-ఎల్ 1 సూర్యుని బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios