ఏషియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుంధు సూర్యకుమార్ పై ఓ మాజీ సబ్ జడ్జీ ఎస్ సుదీప్ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర కామెంట్లు చేశారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆయనను తప్పుపట్టారు. వారిపైనా మాజీ న్యాయమూర్తి ఎస్ సుదీప్ దూషణలు చేశారు. పోలీసులు మాజీ జడ్జీ సుదీప్ పై కేసు ఫైల్ చేశారు.
తిరువనంతపురం: ఏషియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్ పై మాజీ సబ్ జడ్జీ ఎస్ సుదీప్ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఫేస్‌బుక్ పోస్టు వైరల్ అయింది. దీంతో మీడియా ప్రతినిధులు ఆయనపై విమర్శలు కురిపించారు. సింధు సూర్యకుమార్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఆయన పోస్టును విమర్శించిన వారిపైనా మాజీ జడ్జీ సుదీప్ అసభ్యకర రీతిలో దూషణలు చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎన్నింటినో ఎత్తిచూపిన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్ పై వామపక్షాల మద్దతు ఉన్న మాజీ న్యాయమూర్తి ఎస్ సుదీప్ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు ఒకటి రాశారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడంతో సింధు సూర్యకుమార్ పై ఇప్పటికే ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతున్నారు. ఆ మాజీ జడ్జీ తన హోదాను మరిచి ఇలా పోస్టు రాయడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేరళలోని పినరయి విజయన్ సారథ్యంలోని ప్రభుత్వం ప్రధాన స్రవంతి, ఆన్ లైన్ మీడియాపై గతంలో ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడుతున్నది. ఈ ఘటనలో ఒక జడ్జీ న్యాయం వైపు నిలబడాల్సింది పోయి ప్రభుత్వ పక్షం వహిస్తూ అసభ్యంగా, దురుసుగా రాసుకొచ్చారు. దీంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఏషియానెట్ న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ మనోజ్ కే దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదిదారుల అంశాలను పరిశీలించారు. సైబర్ స్పేస్‌లో మాజీ న్యాయమూర్తి ఎస్ సుదీప్ అసభ్యకర పోస్టు చేసినట్టుగా తిరువనంతపురం పోలీసులు గుర్తించారు. కేసు ఫైల్ చేశారు.
శబరిమలకు సంబంధించి మాజీ జడ్జీ ఎస్ సుదీప్ గతంలో అభ్యంతరక పోస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అనంతరం, ఆయనపై అనేక ఫిర్యాదులు హైకోర్టుకు అందాయి. దీంతో అప్పటి సబ్ జడ్జీ ఎస్ సుదీప్ పై విచారించాలని ఓ ప్యానెల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల తర్వాత 2021లో ఎస్ సుదీప్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి లెఫ్ట్ ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా కనిపించేవాటిన్నింటిపై విమర్శించే పని పెట్టుకున్నారు.
ఏషియానెట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్ వీక్లీగా ప్రచురించి ‘కవర్ స్టోరీ’ ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో ఉంటుంది. వాటి తప్పిదాలను కటువుగా బట్టబయలు చేస్తున్నది. తాజా కథనాన్ని మాజీ న్యాయమూర్తి ఎస్ సుదీప్ తప్పు పట్టారు. ఆ కథనంలో అవాస్తవాలు ఉన్నాయని ఆరోపించారు.
