ఇండియాలో 20 వేలకు చేరువలో కరోనా కేసులు: మొత్తం 640 మంది మృతి
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 19,984కు చేరుకుంది. మొత్తం 640 మంది మరణించారు.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,383 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 50 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా వేరస్ కేసుల సంఖ్య 19,984కు చేరుకుంది. మరణాల సంఖ్య 640కి చేరుకుంది.
ఇప్పటి వరకు దేశంలో 15,474 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చర్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య15,474 ఉంది.
మహరాష్ట్రలో 4,666 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 2,081 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. గుజరాత్ లో 1,938 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో 232 మంది మరణించారు. మధ్యప్రదేశ్ లో 76 మంది మరణించారు. గుజరాత్ లో 71 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో 47 మంది మరణించారు. గత మూడు రోజుల పాటు ఒడిశాలో ఊరటనిచ్చిన కరోనావైరస్ మళ్లీ నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒడిశాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 82కు చేరుకుంది.