Asianet News TeluguAsianet News Telugu

ప్రెగ్నెంట్ స్టూడెంట్లకు 60 రోజుల మెటర్నిటీ సెలవులు.. కేరళ యూనివర్సిటీ సంచలన నిర్ణయం

కేరళ యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రెగ్నెంట్ స్టూడెంట్లు 60 రోజుల మెటర్నిటీ సెలవులు తీసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు ప్రెగ్నెన్సీ కారణంగా తమ చదువులకు దూరం కావొద్దని, వాటికి ఆటంకం కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
 

kerala university offers maternity leaves of 60 days for pregnant students
Author
First Published Dec 24, 2022, 3:31 PM IST

తిరువనంతపురం: కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన, డిగ్రీ లేదా పీజీ విద్యార్థులు కోర్సు చేస్తున్న సమయంలో గర్భం దాలిస్తే వారికి 60 రోజుల మెటర్నిటీ లీవులు ఇవ్వాలని నిర్ణయించింది. వారి చదువులకు ఆటంకం కలుగకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఐ తన కథనంలో వివరించింది. ప్రొ. వైస్ చాన్సిలర్ సీటీ అరవింద్ కుమార్ సారథ్యంలో శుక్రవారం సిండికేట్ సమావేశంలో అయింది. ఈ సిండికేట్ ఏర్పాటు చేసిన కమిటీ మెటర్నిటీ సెలవులపై అధ్యయనం చేసి సిఫారసులు చేసింది. అందుకు అనుకూలంగా శుక్రవారం సిండికేట్ నిర్ణయం తీసుకుంది.

ఆ యూనివర్సిటీ ప్రకారం, విద్యార్థులు మెటర్నిటీ సెలవులు డెలివరీకి ముందు లేదా డెలివరీ తర్వాత అయినా తీసుకోవచ్చు. మొదటి లేదా రెండో ప్రెగ్నెన్సీకి మాత్రమే మెటర్నిటీ సెలవులు పొందగలుగుతారు. అదీ కూడా కోర్సు డ్యురేషన్‌లో ఒకేసారి ఈ అవకాశం విద్యార్థులకు ఉంటుంది. ఈ 60 రోజుల మెటర్నిటీ సెలవుల్లో పబ్లిక్, ఆర్డినరీ హాలిడేస్ కలిసే ఉంటాయి. వేరే ఇతర సెలవులు వీటికి జోడించే అవకాశం ఉండదు.

అదే అబార్షన్ లేదా ట్యూబెక్టమీ వంటి వాటికి 14 రోజుల సెలవులను యూనివర్సిటీ ఇస్తుంది.

Also Read: పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. బీహార్‌లో ఐదుగురు అరెస్ట్

ప్రెగ్నెన్సీ సమయంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగరాదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్సిటీ పేర్కొంది. ఈ సెలవుల్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్‌ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. వారు ఆ సెమిస్టర్ పరీక్షలను రెగ్యులర్ విద్యార్థులతో కలిసే మరో సెమిస్టర్‌లో సప్లిమెంటరీ పరీక్షలుగా రాసుకోవచ్చు. ఈ మెటర్నిటీ సెలవుల కారణంగా వారు సెమిస్టర్ లాస్ కారని తెలిపింది. మెటర్నిటీ సెలవులు అయిపోగానే వారు యథావిధిగా తమ బ్యాచ్ సెమిస్టర్ విద్యార్థులతో కలిసి చదువు కొనసాగించుకోవచ్చు.

మెటర్నిటీ సెలవుల సమయంలో ప్రాక్టికల్ పరీక్షలు, ల్యాబ్, వైవా వంటి పరీక్షలు ఉంటే ఆ ఇన్‌స్టిట్యూషన్ లేదా డిపార్ట్‌మెంట్ హెడ్ అవసరమైన ఏర్పాట్లు చేస్తారని ఆ ప్రకటన తెలిపింది.

మెటర్నిటీ సెలవుల కోసం సదరు విద్యార్థి రిజిస్టర్డ్ డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్, అప్లికేషన్‌ను మూడు రోజుల ముందుగా సమర్పించాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios