Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. బీహార్‌లో ఐదుగురు అరెస్ట్

Patna: పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు బీహార్‌లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. భోజ్‌పూర్‌లోని చండీ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ బ్యాడ్మింటన్ ఆట తర్వాత బృందం తమ విజయాన్ని జరుపుకుంది. ఈ క్ర‌మంలోనే దేశ వ్యతిరేక నినాదాలు చేసింది.
 

Patna : Pro-Pakistan slogans; Five arrested in Bihar
Author
First Published Dec 24, 2022, 3:18 PM IST

Bhojpur Police: పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కొందరు యువకులు నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీహార్ లోని అర్రా జిల్లాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు బీహార్‌లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. భోజ్‌పూర్‌లోని చండీ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ బ్యాడ్మింటన్ ఆట తర్వాత బృందం తమ విజయాన్ని జరుపుకుంది. ఈ క్ర‌మంలోనే దేశ వ్యతిరేక నినాదాలు చేసింది. నీలం రంగు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వీడియోను తయారు చేస్తున్నట్లు వీడియోలో ఉంది.

విజయోత్సవ ఊరేగింపులో ఇద్దరు వ్యక్తులు తమ చేతుల్లో ట్రోఫీని పట్టుకున్నట్లు చూడవచ్చు. యువత పాక్ అనుకూల నినాదాలు చేస్తూ ఊరేగడం సంబంధిత వీడియో దృశ్యాల్లో క‌నిపించింది. ఇతర నిందితులను పట్టుకోవడానికి పోలీసులు వీడియోను నిశితంగా పరిశీలిస్తున్నారు.  తదుపరి విచారణ కొనసాగుతోందని, అరెస్టు చేసిన వ్యక్తులను విచారిస్తున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

 

వార్తాసంస్థ ఏఎన్ఐతో చాందీ పోలీసు స్టేష‌న్ ఎస్ హెచ్ వో మాట్లాడుతూ..  "మేము ఈ విషయంలో ఐదుగురిని అరెస్టు చేసాము. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. మిగ‌తా వారిని గుర్తించ‌డానికి వీడియో దృశ్యాల‌ను ప‌రిశీలిస్తున్నాము" అని తెలిపారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios