వాళ్లిద్దరూ లండన్ నుంచి కేరళకు వచ్చిన దంపతులు. వారిద్దరికీ కరోనా లక్షణాలు ఉండటంతో... అధికారులు ముందే అప్రమత్తమై వారిని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరినట్లే చేరి.. చికిత్స తీసుకున్నట్లే తీసుకున్న ఈ దంపతులు ఒక్కసారిగా ఆస్పత్రి నుంచి ఎస్కేప్ అయ్యారు. దీంతో వారిని వెతికే పనిలో పడ్డారు అధికారులు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read కరోనా భయం: ఇన్ఫోసిస్ కార్యాలయ భవనం ఖాళీ...

అమెరికాకి  చెందిన దంపతులు మూడేళ్ల క్రితం లండన్ వెళ్లారు. లండన్ నుంచి ఇటీవల వీరు  కేరళ రాష్ట్రానికి వచ్చారు.   ఈ నెల 10వతేదీన కొచ్చిలోని కోటను సందర్శించారు. అనంతరం అల్లప్పుజా నగరంలో పర్యటించిన అమెరికా దంపతులు వర్కాల రైల్వేస్టేషనుకు వచ్చారు. అమెరికా దంపతులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని వెంటనే అల్లప్పుజాలోని వైద్యకళాశాల ఆసుపత్రికి తీసుకువచ్చారు.

 అమెరికా దంపతుల ట్రావెల్ హిస్టరీని తెలుసుకున్న వైద్యులు వారిని ఐసోలేషన్ వార్డుకు తరలివెళ్లాలని సూచించారు. అయితే అమెరికా దంపతులు శుక్రవారం సాయంత్రం డాక్టర్ల కన్నుగప్పి ఆసుపత్రి నుంచి పారిపోయారు. పారిపోయిన అమెరికా దంపతులకు కరోనా వైరస్ లక్షణాలుండటంతో వారి ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని అల్లప్పుజా జిల్లా కలెక్టరు ఎం అంజనా చెప్పారు. అయితే.. ఆ దంపతులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిని మళ్లీ ఆస్పత్రికి తరలించినట్లు తాజా సమాచారం.