కరోనా భయం: ఇన్ఫోసిస్ కార్యాలయ భవనం ఖాళీ
ఐటీ దిగ్గజం ఇన్నఫోసిస్ బెంగళూరులోని తన కార్యాలయ భవనాన్ని ఖాళీ చేసింది. కరోనావైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే చర్యల్లో భాగంగా భవనాన్ని ఖాళీ చేసినట్లు ఇన్ఫోసిస్ అధికారి ప్రకటించారు.
బెంగళూరు: కరోనా వైరస్ భయంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనాన్ని ఖాళీ చేశారు. కోవిడ్ 19 సోకుతుందనే భయంతో ఆ భవనాన్ని ఖాళీ చేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడే క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా భవనాన్ని ఖాళీ చేసినట్లు, కొంత మంది సభ్యులు కోవిడ్ 19కు సోకినట్లు అనుమానం కలగడంతో ఆ పనిచేసినట్లు ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్ పాండే ఈ మెయిల్ ద్వారా తెలియజేశారు.
ఇన్ఫోసిస్ క్యాంపస్ లో డజన్ దాకా భవనాలుున్నాయి. ఉద్యోగుల భద్రత కోసమే తాము ఆ పనిచేశామని, రక్షణ కోసం ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తామని ఆయన తెలిపారు. ఆందోళన చెందవద్దని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఉద్యోగులను కోరారు.
Also Read: కరోనా వైరస్... అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్
సోషల్ మీడియా చానెల్స్ లో వచ్చే పుకార్లను నమ్మవద్దని ఆయన ఉద్యోగులను కోరారు. అత్యవసరమైతే సంస్త గ్లోబల్ హెల్ప్ డెస్క్ నంబర్లకు కాల్ చేయాలని ఆయన కోరారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన ఉద్యోగులను కోరారు.
కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండడానికి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం అన్ని ఐటీ, బయోటెక్ కంపెనీలను ఆదేశించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఆ చర్యలు తీసుకుంది.
Also read: కరోనావైరస్ తో ఢిల్లీలో మహిళ మృతి: దేశంలో రెండో మరణం