తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో 105 ఏళ్ల బామ్మ  బాగీరథి అమ్మ 4వ తరగతి పరీక్షలో ఉ్తత్తీర్ణత సాధించింది.  రాష్ట్ర లిటరసీ మిషన్ నిర్వహించిన   పరీక్షల్లో బాగీరథి అమ్మ  నాలుగవ తరగతి పరీక్షల్లో  ఉత్తీర్ణత సాధించింది.  మొత్తం 275 మార్కులకు గాను 205 మార్కులను సాధించింది.

 బాగీరథి అమ్మ ఈ పరీక్షల్లో 74.5 శాతం పర్సంటెజీతో ఉత్తీర్ణతను సాధించింది.   ఈ పరీక్షల్లో గణితంలో 75 మార్కులకు 75 మార్కులను ఆమె సాధించింది.  

మళయాలం, నమ్మలుం నమ్మక్కుచుట్టుం, గణిత, ఇంగ్టీష్ సబ్జెక్టుల్లో ఆమె పరీక్షలు రాశారు.  ఇంగ్లీష్‌కు మాత్రమే మొత్తం మార్కులు 50. ఇతర సబ్జెక్టుల్లో మొత్తం మార్కులు 75.  ఇంగ్లీషులో 50 మార్కులకు ఆమె 30 మార్కులను సాధించారు. మళయాలం, నమ్మలుం నమ్మక్కుచుట్టుం సబ్జెక్టుల్లో ఆమెకు 30 మార్కులు వచ్చాయి.

కేరళ రాష్ట్ర లిటరసీ మిషన్  సెక్రటరీ పీఎస్ శ్రీకళ  ప్రాక్కుళంలో ఉన్న బాగీరథి అమ్మ ఇంటిని  సందర్శించారు. పదవ తరగతి సమాన స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించడమే తన కోరిక అని బాగీరథి అమ్మ  కేరళ రాష్ట్ర లిటరసీ మిషన్‌ సెక్రటరీని కోరారు. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తావని శ్రీకళ బాగీరథి అమ్మకు చెప్పారు.  

బాగీరథి అమ్మకు  ఆరుగురు పిల్లలు. 16 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. ఆమె తన కుటుంబంలో ఐదో జనరేషన్‌ను చూస్తోంది.  11,593 మంది 4వ, తరగతికి పరీక్షలకు హాజరయ్యారు. అయితే 10, 012 మంది మాత్రమే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో  105 ఏళ్ల బాగీరథి అమ్మ కూడ ఉండడం విశేషం.  

9456 మంది మహిళలు పరీక్షలు రాస్తే  పతనంమిట్టకు చెందిన 385 మంది మహిళలు ఉత్తీర్ణత సాధించారు. 2018 అక్టోబర్ మాసంలో కార్తీయాని అమ్మ 96 ఏళ్ల వయస్సులో కూడ 4వ, తరగతి పరీక్షల్లో పాసైంది.  100 మార్కులకు గాను ఆమెకు 98 మార్కులు లభించాయి.