లోన్ రికవరీ కోసం పోలీసు స్టేషన్‌ను కూడా అటాచ్ చేశారు.. చివరకు ఏం జరిగిందంటే?

కేరళలో ఇదుక్కిలోని ఓ పోలీసు స్టేషన్‌ను లోన్ రికవరీ కోసం అటాచ్ చేశారు. బ్యాంకు లోన్ తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఆ భూమిని అటాచ్ చేస్తున్నట్టు ట్రిబ్యులన్ ఆ పోలీసు స్టేషన్‌కు ఇంటిమేషన్ ఇచ్చింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆ తర్వాత ట్రిబ్యునల్‌కు పోలీసులు సమాధానం ఇచ్చారు. తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉన్నది.
 

kerala police station attached for loan default, revenue department exempted after kms

న్యూఢిల్లీ: బ్యాంకు వేలంలో ఓ వ్యక్తి భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని మరొకరికి అమ్మేశాడు కూడా. అయితే.. కాగితాలపై ఉన్న భూమి.. వాస్తవంలో భూమికి మధ్య పొంతన లేకుండా ఉన్నది. ఈ భూమిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు. కానీ, లోన్ కట్టలేదు. దీంతో భూమి రికవరీ చేసుకోవాలని ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అయితే.. ఆదేశాలు ఇచ్చిన భూమిలో పోలీసు స్టేషన్, పోలీసు హెడ్ క్వార్టర్ కూడా ఉన్నది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటన కేరళలోని ఇదుక్కిలో చోటుచేసుకుంది.

వెల్లతూవల్ పోలీసు స్టేషన్‌కు జూన్‌లో డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుంచి ఓ ఇంటిమేషన్ వచ్చింది. అదేమిటంటే.. వెల్లతూవల్ పోలీసు స్టేషన్, దాని హెడ్ క్వార్టర్స్ ఉన్న భూమిని అటాచ్ చేసినట్టు సందేశం ఉన్నది. దీంతో జిల్లా పోలీసు చీఫ్ వెంటనే రంగంలోకి దిగారు. 1989లో జిల్లా కలెక్టర్ ఆ భూమిని పోలీసు స్టేషన్ అవసరాల కోసం కేటాయించిన ఆదేశాల పత్రాన్ని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు అందించారు.

దీంతో మరోసారి సర్వే చేశారు. హెడ్ సర్వేయర్ సమీక్ష చేయగా.. అటాచ్ చేయాల్సిన ఆస్తుల నుంచి పోలీసు స్టేషన్ మినహాయించారు. ఈ రిపోర్టును తహశీల్దార్‌కు అందించినట్టు వివరించారు. బ్యాంకుకు గ్యారంటీగా ఇచ్చిన భూమి సరిహద్దులు తేల్చాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన వ్యక్తి వాదనలకు భిన్నంగా వాస్తవాలు ఉన్నాయని వివరించారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: నన్నే ప్రశ్నిస్తావా? చంద్రయాన్ 4తో నిన్ను చంద్రుడి మీదికి పంపేస్తా: పేద మహిళపై హర్యానా సీఎం

2012 వేలంలో కొనుగోలు చేసిన భూమి గురించి కొనుగోలుదారు చెప్పినట్టుగా పెద్ద స్ట్రెచ్ కాదని, ఆయన చెబుతున్నదాని కంటే తక్కువ మొత్తంలోనే ఆ భూమి ఉన్నదని సర్వేయర్ తెలిపారు. ఆ భూమిని కొనుగోలు దారు వేరేవారికి అమ్మేశాడు. రోడ్డు, చెంకుల డ్యాం నుంచి వెళ్లే చిన్న కాల్వకు మధ్య ఉన్న భూమిని బ్యాంకుకు గ్యారంటీగా ఇచ్చారని స్పష్టంగా ఉన్నదని తెలిపాడు. ఈ పోలీసు స్టేషన్ దానికి బయట, రోడ్డుకు ఆవల ఉన్నదని స్పష్టం చేశాడు. దీనిపై ఇంకా ఆదేశాలు రావల్సి ఉన్నది. ట్రిబ్యునల్ తుది నిర్ణయాన్ని చెప్పాల్సి ఉన్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios